Bigg Boss Telugu 9: హాట్ స్టార్ ఓటింగ్ అనాలసిస్.. బిగ్ బాస్ 9 టాప్- 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. కప్పు కొట్టేది తనేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 12 వారంలోకి అడుగు పెట్టిన ఈ రియాలిటీ షోకు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో టాప్- 5 కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Bigg Boss Telugu 9: హాట్ స్టార్ ఓటింగ్ అనాలసిస్.. బిగ్ బాస్ 9 టాప్- 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. కప్పు కొట్టేది తనేనా?
Bigg Boss Telugu 9

Updated on: Nov 26, 2025 | 7:45 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 12 వ వారం లోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో దాదాపు తుది అంకానికి చేరుకుంది. మొత్తం 23 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాగా ప్రస్తుతం 9 మంది మాత్రమే మిగిలారు. తనూజ, పవన్ కల్యాణ్ పడాల, డిమాన్ పవన్, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, భరణి, దివ్య నికితా, సంజనా గల్రానీ, సుమన్ శెట్టి ప్రస్తుతం హౌస్ లో మిగిలిపోయారు. ఇప్పుడు ఈ 9 మంది కంటెస్టెంట్స్ లో ఎవరు టాప్ 5 లో ఉండనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలోనూ దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జియో హాట్ స్టార్ లోని ఫ్యాన్ జోన్ లో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఈ సీజన్ మొదటి వారం నుంచి అత్యధిక ఓటింగ్ తో డామినేట్ చేస్తూ వస్తున్న తనూజ టాప్ ప్లేస్ లో నిలిచింది. సేఫ్ గేమ్ ఆడుతుందని కొన్ని విమర్శలు వినిపించినా ఇప్పటికీ టైటిల్ రేసుల ఆమెదే అగ్రస్థానం. తనూజ తర్వాత రెండవ స్థానం లో కామనర్ పవన్ కళ్యాణ్ పడాల ఉన్నారు. మొదట ఇతనిపై తీవ్రమైన నెగెటివిటీ వచ్చినా ఆ తర్వాత తన గేమ్ ప్లాన్ మార్చుకున్నాడు. ఇప్పుడు టైటిల్ రేసులో తనూజకు గట్టి పోటీ ఇస్తున్నాడు.

కాగా ఈ జాబితాలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మూడవ స్థానం లో కొనసాగుతున్నాడు. ఆట, మాట తీరు పరంగా అన్ని రకాలుగా ఓకే అనిపిస్తోన్న ఇమ్మాన్యుయేల్ ఈ సీజన్ లో ఒక్కసారి మాత్రమే నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇప్పుడు అదే అతనికి మైనస్ గా మరింది. టైటిల్ కు దూరంగా మూడో ప్లేస్ లో కొనసాగుతున్నాడీ జబర్దస్త్ కమెడియన్. ఇక నాలుగో పొజిషన్ లో భరణి శంకర్ ఉండడం గమనార్హం. అలాగే డిమాన్ పవన్ ఐదో ప్లేసులో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో జరుగుతోన్న ఓటింగ్ ప్రకారం టాప్-5లో ఈ కంటెస్టెంట్లే ఉండనున్నారు. టాప్-5లో ఉంటారనుకున్న సుమన్ శెట్టి, రీతూ చౌదరికి తక్కువ ఓట్లు పడుతున్నాయి. ఇక సంజన, దివ్య నికితాలు చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

తనూజను ఆపతరమా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.