
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాల్టీ షో ఇప్పటికే 13 వారానికి చేరుకుంది. అంటే మరో రెండు వారాల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో ఈసారి టాప్- 5 కంటెస్టెంట్స్ ఎవరు? గ్రాండ్ ఫినాలేకి ఎవరెవరు వెళతారు? బిగ్ బాస్ కప్పు ఎవరు కొడతారన్న దానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో టాప్-6 కంటెస్టెంట్ తో గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారా? లేక టాప్-5ను ఎంపిక చేసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా సాగుతోంది. అలాగే ఈ వారం ఎలిమినేట్ ఎవ్వరనేది కూడా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. 13వ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లో నిలిచారు. తనూజ, భరణి, రీతూ చౌదరీ, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, సంజనా ఈ వారం నామినేట్ అయిన వారిలో ఉన్నారు. ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ ఈ వారం సేఫ్‌లో ఉన్నారు. ఇక నామినేషన్‌లో ఉన్న వారికి పడుతున్న ఓటింగ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు నమోదైన ఓట్ల లెక్కను ఒక్కసారి పరిశీలిస్తే.. తనూజ మళ్లీ అత్యధిక ఓటింగ్ శాతంతో టాప్‌లో దూసుకుపోతుంది. కల్యాణ్ నామినేషన్స్ లో లేకపోవడంతో అతనికి పడాల్సిన ఓట్లు కూడా తనూజకు పోల్ అవుతున్నాయి. కాబట్టి ఇతర కంటెస్టెంట్లకు ఆమె అందనంత ఎత్తులో ఉంది. ఇక తనూజ తర్వాతి స్థానంలో రీతూ చౌదరి ఉంది. తనూజతో పోల్చితే సగం ఓటింగ్ శాతమే ఉన్నా, రెండో స్థానంలో ఉండడం రీతూకు అడ్వాంటేజ్ గా మారింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. టాప్ 3లో సంజనా ఉంది. ముఖ్యంగా గతవారం వీకెండ్ ఎపిసోడ్ సంజానా ఓటింగ్ ను అమాంతం పెంచేసింది నాలుగో స్థానంలో భరణి ఉన్నాడు.
ఇక ఐదో స్థానంలో డిమాన్ పవన్ ఉండగా, ఆఖరి ఆరో స్థానంలో సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. భరణికి, పవన్‌కి, సుమన్ శెట్టికి మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఓటింగ్ కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఓటింగ్ ర్యాంకింగ్స్ లో అనూహ్య మార్పులు చోటు చేసుకోవచ్చు.
Too funny to miss😂
Unseen going wild! 🔥Watch #BiggBossTelugu9 UnSeen Extra Cuts Mon–Fri 10:30 PM on #StarMaa pic.twitter.com/sms4yVu8E4
— Starmaa (@StarMaa) December 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.