
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం హౌస్ లో ఫ్యామిలీ వీక్ జరుగుతోంది. కాగా ఎప్పటిలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదకొండో వారం నామినేషన్స్ హోరా హోరీగా సాగాయి. ఈసారి గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ సీజన్ లో ఇప్పటివరకు నామినేషన్స్ లోకి రాని ఇమ్మాన్యుయేల్ మొదటిసారిగా ఈ జాబితాలోకి వచ్చాడు. అలాగే హౌస్ లో లవ్ బర్డ్స్ గా పేరు పొందారు డిమాన్ పవన్- రీతూ చౌదరి. అయితే ఈ వారం రీతూని నామినేట్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు పవన్. ఇలా నామినేషన్స్ పూర్తయ్యేసరికి 11 వ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో కళ్యాణ్ పడాల, భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, డెమోన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖితా ఉన్నారు. ఈ జాబితాలో రీతూ చౌదరి కూడా ఉండాల్సింది. అయితే తన కెప్టెన్సీ పవర్ తో తనూజ రీతూను సేవ్ చేసింది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఈ జబర్దస్త్ బ్యూటీ తప్పించుకుంది.
ఇక 11వ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభైమంది. సోషల్ మీడియా పోల్స్, ఆన్‌లైన్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం.. మరోసారి కళ్యాణ్ పడాల నే టాప్‌లో దూసుకెళ్తున్నాడు. ఇక తొలిసారి నామినేషన్స్ లోకి వచ్చిన ఇమ్మాన్యుయేల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు.ఇక భరణి థర్డ్ పొజిషన్‌లో ఉండగా, డిమాన్ పవన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సంజనా గల్రానీ ఐదో ప్లేసు, దివ్య నికితా ఆరో ప్లేసులో కొనసాగుతున్నారు. అంటే ప్రస్తుతం సంజన, దివ్య డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. అయితే శుక్రవారం అర్థరాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అలాగే బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం ఫ్యామిలీ వీక్ కూడా మొదలైంది. కాబట్టి ఓటింగ్ సరళిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవచ్చు.
Hearts full and smiles bright… Suman’s family joins the Bigg Boss house! 🩷🏡
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/lbbrnmYGMr
— Starmaa (@StarMaa) November 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.