Bigg Boss Telugu 9: మారిపోయిన లెక్కలు.. బిగ్ బాస్ టాప్-5లో బిగ్ ట్విస్ట్.. టైటిల్ రేసులోకి ఆ కంటెస్టెంట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసి టాప్-6 తో గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారా? లేదా టాప్-5 ను తీసుకుంటారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

Bigg Boss Telugu 9: మారిపోయిన లెక్కలు.. బిగ్ బాస్ టాప్-5లో బిగ్ ట్విస్ట్.. టైటిల్ రేసులోకి ఆ కంటెస్టెంట్
Bigg Boss Telugu 9

Updated on: Dec 03, 2025 | 9:59 PM

బిగ్ బాస్ తెగులుగు సీజన్ 9 తుది దశకు వచ్చింది. సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ అయిన ఈ రియాల్టీషో సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇప్పటికే ఈ షోలో 12 వారాలు గడిచిపోయాయి. ఇప్పుడు 13వ వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మరో కొన్ని రోజుల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో ఈసారి బిగ్ బాస్ హౌస్ విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? టాప్ -5లో ఎవరుంటారు? అన్న విషయాలపై ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేపై తీవ్ర చర్చ జరుగుతోంది. కాగా ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇప్పుడు టికెట్ టు ఫినాలే రేస్ హోరా హోరీగా సాగుతోంది. అలాగే ఈ వారం ఎలిమినేట్ ఎవ్వరనేది కూడా క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తోంది. 13వ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లో నిలిచారు. తనూజ, భరణి, రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి, సంజనా ఈ వారం నామినేట్‌ అయిన వారిలో ఉన్నారు. . ఇమ్మాన్యుయెల్‌, కళ్యాణ్‌ ఈ వారం సేఫ్‌లో ఉన్నారు.

ఇక ఎప్పటిలాగే ఓటింగ్ లో తనూజ టాప్ లో ఉండగా.. రీతూ చౌదరి సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక సంజనా గల్రానీ మూడో ప్లేస్ లో ఉండగా, భరణి నాలుగో పొజిషన్ లో ఉన్నాడు. డిమాన్ పవన్ ఐదు, సుమన్ శెట్టి ఆరో ప్లేసులో కొనసాగుతున్నారు. అంటే ప్రస్తుతం సుమన్ శెట్టి డేంజర్ లో ఉన్నాడన్నమాట. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ వారం సుమన్ ఎలిమినేట్ అవ్వడం లాంఛనమే.

ఇవి కూడా చదవండి

ఇక సోషల్ మీడియా ట్రెండ్ ప్రకారం.. కల్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజన, డిమాన్ పవన్ టాప్-5లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత వారం ఎపిసోడ్ తో సంజనా గ్రాఫ్ బాగా పెరిగింది. దీంతో ఆమె ఇప్పుడు టాప్-5 లో గ్యారెంటీగా ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ అందాల తార టాప్-3 అలాగే టైటిల్ రేసులో నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు కొంతమంది. మరి వీటిలో ఏది నిజమవుతుందో తెలియాలంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసం వేచి చూడాల్సిందే.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.