
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభంలో ఇమ్మాన్యుయేల్ టాప్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. అందుకు తగ్గట్టే తన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. అయితే అతని అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ సీజన్ స్టార్టింగ్ నుంచి మొన్నటి వీక్ దాకా అసలు నామినేషన్స్ లోకి రాలేదు. ఇది అతని ఓటింగ్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. టైటిల్ రేసులో ఉండాల్సిన ఇమ్మూ కాస్తా టాప్-3 కి పడిపోయాడు. అయితే ఎప్పుడైతే గ్రాండ్ ఫినాలే రేసు ప్రారంభమయ్యిందో ఇమ్మూ మళ్లీ విజృంభిస్తున్నాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫిజికల్ టాస్కుల్లో అదరగొడుతున్నాడు. అందుకే ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ రేసులోనూ టాప్ లో దూసుకెళుతున్నాడు. అయితే ఈ టాస్కుల్లో శారీకరంగా, మానసికంగా ఇమ్మూ అలసిపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇది స్పష్టంగా కనిపించింది.
టికెట్ టు ఫినాలే రేస్ లో భాగంగా సంజన-తనూజ-ఇమ్మానుయేల్ మధ్య టాస్క్ జరిగింది. అయితే ఈ టాస్క్ లో సంజన, ఇమ్మూల మధ్య వాగ్యుద్దం జరిగింది. ఎందుకు నన్ను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారంటూ ఇమ్మూ తీవ్ర ఆవేదన చెందాడు. . ‘నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. వారం రోజుల నుంచి నన్ను ఏం పోట్రేట్ చేయాలని చూస్తోంది. వారం నుంచి నా వైపు ఒక్కసారైనా చూసిందా? అని ఎమోషనలయ్యాడు. దీంతో లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సంజనాను అందరూ ఏకాభిప్రాయంతో తొలగించినట్లు కనిపిస్తోంది.
ఇక చివరిగా ఇమ్మానుయేల్- తనూజలకి ‘బ్యాలెన్స్ చెయ్ డ్యూడ్’.. అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ గేమ్‌కి సంజన సంచాలక్‌గా వ్యవహరించింది. అయితే గేమ్ మధ్యలో ఇమ్మూకి సడెన్‌గా కాల్ బెణికింది. దీంతో గేమ్ ఆడలేక కిందపడిపోయాడీ టాప్ కంటెస్టెంట్. నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఒక్కసారి పాస్ చెప్తారా ప్లీజ్ అని సంజనని రిక్వెస్ట్ చేశారు. గాయం తీవ్రంగా ఉండడంతో గేమ్ మధ్యలోనే భరణి- కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఇమ్మూని లోపలికి తీసుకెళ్లారు
It’s do-or-die time! Who’s securing that 2nd finalist spot in this ultimate nomination showdown? ⚔️🔥
Watch #BiggBossTelugu9 Mon–Fri 10:00 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/nTmKSUjqpf
— Starmaa (@StarMaa) December 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.