Bigg Boss 7 Telugu: కాలర్ పట్టుకుని కొట్టుకున్నంత పని చేసిన అమర్‌, సందీప్..

| Edited By: Ravi Kiran

Oct 20, 2023 | 1:24 PM

ఇక ఏలియన్ తన గ్రహానికి వెళ్లేందుకు ఫ్యూయల్‌ కావాలని.. అందుకు కంటెస్టెంట్స్ సాయం చేయాలని చెప్పిన బిగ్ బాస్‌.. అందుకోసం ఓ టాస్క్‌ పెడతాడు. సిమ్మింగ్ పూల్లో లాక్‌ వేసిన బాక్స్‌ పెట్టి.. బయట వాటికి సంబంధించిన కీస్‌ ఉన్న కుప్ప పెట్టి.. అందులో ఉన్న కీని ట్రై చేస్తూ.. స్విమ్మింగ్ పూల్లో ఉన్న బాక్స్‌ ఓపెన్ చేయాలని టాస్క్‌ ఇస్తాడు. అలా ముందుగా ఓపెన్ చేసి దాంట్లో ఉన్న గ్రీన్ ఫ్యూయల్‌ను ఎలియన్‌కు అందియ్యాలని.. చెబుతాడు. అయితే ఎవరైతే ముందుగా ఈ టాస్క్‌ ఫినిష్ చేస్తారో వారే విజేతలంటూ చెబుతాడు.

Bigg Boss 7 Telugu: కాలర్ పట్టుకుని కొట్టుకున్నంత పని చేసిన అమర్‌, సందీప్..
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్ బాస్‌ సీజన్‌ 7 మొదలైంది మొదలు.. అటు ఎంటర్‌టైమన్మెంట్‌ టాస్కులను ఇటు యాక్షన్ టాస్కులను బ్యాలెన్స్‌ చేస్తూ వస్తున్న బిగ్ బాస్‌.. ఇవ్వాల్టి 47th ఎపిసోడ్‌లోనూ అదే మెయిన్‌టేన్ చేశారు. గులాబి పురం, జిలేబి పురం అంటూ హౌస్‌లో కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా డివైడ్ చేసిన బిగ్ బాస్.. బీబీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయమని వాళ్లకు చెప్పారు. వాళ్లు ప్లే చేయడానికి క్యారెక్టర్స్ ఇచ్చారు. వారి క్యారెక్టర్స్‌కు తగ్గట్టు. ప్లే చేస్తూ.. అందర్నీ నవ్విస్తుండగానే.. మధ్యలో ఈ రెండు గ్రూపుల మధ్య సూపర్ టఫ్ టాస్కులు పెడుతున్నాడు. ఇక ఏలియన్ తన గ్రహానికి వెళ్లేందుకు ఫ్యూయల్‌ కావాలని.. అందుకు కంటెస్టెంట్స్ సాయం చేయాలని చెప్పిన బిగ్ బాస్‌.. అందుకోసం ఓ టాస్క్‌ పెడతాడు. సిమ్మింగ్ పూల్లో లాక్‌ వేసిన బాక్స్‌ పెట్టి.. బయట వాటికి సంబంధించిన కీస్‌ ఉన్న కుప్ప పెట్టి.. అందులో ఉన్న కీని ట్రై చేస్తూ.. స్విమ్మింగ్ పూల్లో ఉన్న బాక్స్‌ ఓపెన్ చేయాలని టాస్క్‌ ఇస్తాడు. అలా ముందుగా ఓపెన్ చేసి దాంట్లో ఉన్న గ్రీన్ ఫ్యూయల్‌ను ఎలియన్‌కు అందియ్యాలని.. చెబుతాడు. అయితే ఎవరైతే ముందుగా ఈ టాస్క్‌ ఫినిష్ చేస్తారో వారే విజేతలంటూ చెబుతాడు.

ఇక రసవత్తరంగా సాగిన ఈ టాస్క్‌లో.. సందీప్‌, అమర్‌ స్విమ్మింగ్ పూల్లో కలబడతారు. బాక్స్‌ తాళం తీసే క్రయంలో.. కాలర్ పట్టుకుని కొట్టుకున్నంత పని చేస్తారు. అందులో సందీప్‌ అయితే… అమర్‌ను కాస్త ఓవర్‌గా ఫిజికల్ అయినట్టు కనిపిస్తారు. కానీ ఫైనల్‌గా.. సందీప్‌, ప్రియాంక తెలివిగా ఆడడంతో.. గెలుస్తారు. దీంతో పంచాలక్‌గా ఉన్న శివాజీ.. జిలేబి పురం టీం గెలిచినట్టు అనౌన్స్ చేస్తాడు.

ఇక ఈటాస్క్ చాలా ఫిరోషియస్‌గా కంప్లీట్ అయిందో లేదో.. అప్పుడే తేజకు ఫన్నీ టాస్క్‌ ఇస్తాడు. హౌస్‌లో ఉన్న అమ్మాయిల్లో ఒకరి పేరును పచ్చ బొట్టుగా పొడిపించుకోవాలని చెబుతాడు. అందుకు, తాను పచ్చబొట్టు పొడిపించుకోను అంటూ.. తేజ మొదట బిగ్‌ బాస్‌ను రిక్వెస్ట్‌ చేసినప్పటికీ.. ఆ తరువాత ఓకే అంటాడు. శోభ తనను పెళ్లి చేసేందుకు ఒప్పుకుంటే.. డెఫనెట్‌గా పచ్చ బొట్టు పొడిపించుకుంటా అంటూ.. చెబుతాడు. అందుకు శోభ కూడా ససేమిరా అనడంతో.. ఈ టాస్క్‌ ఎటూ కాకుండా ఫినిష్‌ అవుతుంది.

ఇక ఆ తరువాత మళ్లీ లైన్లోకి వచ్చిన ఏలియన్.. మరో టాస్క్‌ను ఇరు గ్రూపులకు ఇస్తుంది. తన స్పెష్‌ షిప్ స్టార్ట్ అవడంలేదని.. వైర్లు చిక్కుపడ్డాయని.. వాటిని తీసేందుకు ఇరు టీంలు సాయం చేయాలని చెబుతుంది.

ఇక టాస్క్‌ యాక్సెప్ట్ చేసిన రెండు గ్రూపులు.. చిక్కుబడి ఉన్న రంగు రంగుల తాడులను ఏలియన్ చెప్పినట్టు.. చిక్కు తీసి.. ఎదురుగా ఉన్న పాయింట్‌లో పెట్టి.. వారి టీం ప్లాగ్‌ను పెట్టాలంటారు. ఇక ఈ గేమ్‌లో.. జిలేబి పురం నుంచి ప్రశాంత్.. గులాబి పురం నుంచి గౌతమ్‌ పోటీ పడతారు. అందులో పల్లవి ప్రశాంత్ పై గౌతమ్ గెలుస్తాడు. దీంతో మొదటి సారి గులాబి పురం టీం గెలిచింది. ఇక ఈ టాస్క్‌ బిగ్ బాస్‌ హౌస్‌లో ఏలియన్ కథ సమాప్తం అవుతుంది.

ఇక ఆ తరువాత హౌస్‌లోకి బ్లాక్ ఫారెక్ట్ కేక్ పంపిన బిగ్ బాస్.. ఆ కేక్‌పై శోభ పేరును.. తేజకు.. ముందుంది ముసళ్ల పండగ అని వార్నింగ్‌ను పంపిస్తాడు. దీంతో ఈ కేక్‌ను తినాలా వద్దా .. తింటే ఎమవుతుంది. దీని వల్ల హౌస్‌లో తనకు ఏదైన ప్రమాదం వస్తుందా అని ఓ పక్క తేజ ఆలోచిస్తుండగానే.. అమర్‌ కేక్‌ తినేందుకు రెడీ అవుతాడు. అందరం కలిసి తిందాం అని అందర్నీ ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇంకో పక్క.. తేజ, శోభ వద్దంటూ చెబుతుంటారు. అయినా ఇవేమీ పట్టించుకోని అమర్‌… కేకు ముక్కను తీసుకుని తింటాడు. ఇక తరువాత జరిగిన చాలా డిస్కషన్స్ తరువాత చివరికి.. శోభ, తేజ కలిసే కేక్ కట్ చేసి.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో పంచుకుని తింటారు.

– సతీష్ చంద్ర – ఈటీ సీనియర్ ప్రొడ్యూసర్