Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యేది అప్పుడే.. పూర్తి వివరాలు ఇదిగో..

ఐపీఎల్ 2025 సందడి ముగిసింది. ఈ ఏడాది IPL విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB). ఇక ఇప్పుడు త్వరలోనే బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో స్టార్ట్ కాబోతుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9పై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ షో గురించి రోజుకో న్యూస్ వైరలవుతున్న సంగతి తెలిసిందే.

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యేది అప్పుడే.. పూర్తి వివరాలు ఇదిగో..
Bigg Boss

Edited By: TV9 Telugu

Updated on: Jun 05, 2025 | 3:43 PM

బుల్లితెరపై ప్రేక్షకులకు ఇష్టమైన రియాల్టీ షో త్వరలోనే ప్రారంభం కాబోతుంది. వివాదాలు, కాంట్రావర్సీలు, గేమ్స్ ఇలా ప్రతి క్షణం అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్స్ అందించే ఈ షోకు టెలివిజన్ పై ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం భాషలలో ఈ షో విజయవంతంగా రన్ అవుతుంది. ఇక తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటివరకు 8 సీజన్స్ పూర్తి చేసుకుంది. తెలుగు టీవీలో అత్యంత ప్రజాదరణ పొందిన షోలలో ఒకటైన ఈ బిగ్ బాస్ షో 2017లో ప్రారంభమైంది. ప్రతి సీజన్ డ్రామా, భావోద్వేగాలు, వినోదంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక ఇప్పుడు సీజన్ 9 పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. కొన్ని రోజులుగా ఈ సీజన్ గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాలలో చక్కర్లు కొడుతుంది.

నవ్వులు, జోక్స్ నుంచి సీరియస్ ఫైట్స్ వరకు ప్రతిదీ నెట్టింట వైరలవుతుంది. ఇక మూడవ సీజన్ నుంచి తన స్టైల్లో హోస్టింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు నాగార్జున. తాజాగా సీజన్ 9 గురించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తుంది. ఈసారి కొత్త ఆలోచనలు, కొత్త మలుపులతో బిగ్ బాస్ సెటప్ నిర్మిస్తున్నారట. ప్రేక్షకులకు ఈసారి భిన్నమైన కంటెంట్ అందించేందుకు రెడీ అవుతుందట. అయితే ఈ సీజన్ విజయ్ దేవరకొండ, బాలకృష్ణ హోస్టింగ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ నడిచింది. కానీ ఎప్పటిలాగే ఈ సీజన్ సైతం నాగార్జున హోస్టింగ్ చేయనున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 9 కోసం నాగార్జునకు దాదాపు రూ.30 కోట్లకు పైగా పారితోషికం ఇస్తున్నారని సమాచారం. ఇక ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో ఈ సీజన్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ షోలో కుమారి ఆంటీ, బమ్ చిక్ బబ్లూ, రమ్య మోక్ష పేర్లు వినిపిస్తున్నాయి. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..