జబర్దస్థ్ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు టేస్టీ తేజ. అదిరే అభి టీంలో తనదైన పంచులు, కామెడీ టైమింగ్తో అలరించాడు. ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫుడ్ కు సంబంధించిన వీడియోస్ చేసేవాడు. అలా మెల్లగా హోటల్ ప్రమోషన్స్ చేసేవాడు. తక్కువ సమయంలోనే టేస్టీ తేజ పేరు నెట్టింట మారుమోగింది. అతడి ఫుడ్ వీడియోస్ చూసేందుకు జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపించారు. అటు నటీనటులు సైతం తేజతో ఫుడ్ వీడియోస్ చేసేందుకు ఆసక్తి కనబరిచారు. మెల్లగా పాపులారిటీ పెరిగే కొద్ది సినిమా ప్రమోషన్స్ చేయడం.. ఇంటర్వ్యూస్ చేయడం ప్రారంభించాడు. ఇక యూట్యూబ్ లో వచ్చిన ఫాలోయింగ్ తో బిగ్ బాస్ సీజన్ 7లో ఛాన్స్ కొట్టేశాడు. హౌస్ లో మొదటి నాలుగైదు వారాలు అంతగా అలరించని తేజ.. ఆ తర్వాత మాత్రం తన ఐ క్యూ పవర్, ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పటిలాగే ఫుడ్ వీడియోస్ చేస్తూ మరోసారి ఫాలోవర్లను అలరించాడు.
బిగ్ బాస్ అనంతరం తేజ్ క్రేజ్ మరింత మారిపోయింది. అతడికి తెలుగులో నాలుగైదు సినిమాల్లో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఓవైపు యూట్యూబ్ ఛానల్, సినిమాలంటూ బిజీగా ఉన్న టేస్టీ తేజ.. ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఇరానీ నవాబ్స్ పేరిట ఛాయ్ హోటల్ పెట్టబోతున్నట్లు వెల్లడించాడు. “నేను కొత్తగా ఓ ప్రయాణం మొదలుపెడుతున్నాను.. ఈ ప్రయాణంలో నాతోపాటు మీరు.. మనందరం కలిసి ఎదుగుదాం.. సాధిద్దాం.. సంపాదిద్దాం” అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇక తన కొత్త బిజినెస్ ను రేపు అంటే ఏప్రిల్ 6న ఉప్పల్ లో మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు. అలాగే ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నట్లు తెలిపాడు.
ఇక తన కొత్త బిజినెస్ ఓపెనింగ్ కోసం తన బిగ్ బాస్ ఫ్రెండ్స్ అమర్ దీప్, ప్రియాంక జైన్ ను ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించన వీడియోలను సైతం తన ఇన్ స్టా ఖాతాలో చేశాడు. బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వకముందు టేస్టీ తేజ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాడు. అతడి అసలు పేరు కల్లం తేజ్ దీప్. తెనాలిలో హైస్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసి ఆ తర్వాైత విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.