Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 గ్రాండ్‌ లాంచింగ్‌కు సర్వం సిద్ధం.. కంటెస్టెంట్ల ఫైనల్‌ లిస్ట్‌ ఇదే!

|

Sep 03, 2022 | 9:18 PM

Bigg Boss Season 6 Telugu: మూడో సీజన్‌ నుంచి కంటెస్టెంట్లతో కలిసి స్మాల్‌ స్ర్కీన్‌ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తోన్న అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)నే ఈసారి డబుల్‌ డోస్‌ ఫన్‌ అందించేందుకు రెడీ అయ్యారు.

Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 గ్రాండ్‌ లాంచింగ్‌కు సర్వం సిద్ధం.. కంటెస్టెంట్ల ఫైనల్‌ లిస్ట్‌ ఇదే!
Bigg Boss 6
Follow us on

Bigg Boss Season 6 Telugu: బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్‌ సీజన్‌-6 సిద్ధమైంది. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఆరో సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆదివారం (సెప్టెంబర్‌4) సాయంత్రం ఈషో లాంఛ్‌ కానుంది. దీని కోసం హౌస్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మూడో సీజన్‌ నుంచి కంటెస్టెంట్లతో కలిసి స్మాల్‌ స్ర్కీన్‌ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తోన్న అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)నే ఈసారి డబుల్‌ డోస్‌ ఫన్‌ అందించేందుకు రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుత సీజన్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల గురించి సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈసారి షోలో పాల్గొనబోతున్నది వీళ్లేనంటూ ఓ లిస్ట్‌ నెట్టింట బాగా చక్కర్లు కొడుతుంది.

సోషల్‌ మీడియాలో కొందరు లీకు వీరులు చెబుతున్న సమాచారం ప్రకారం.. చలాకి చంటి, యూట్యూబర్ ఆదిరెడ్డి, హీరో అర్జున్ కళ్యాణ్, కామన్‌ మ్యాన్‌ రాజశేఖర్, సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్, దీపిక పిల్లి, వాసంత కృష్ణన్, గీతూ రాయల్‌, నటి శ్రీసత్య, అభినయ శ్రీ, రోహిత్, మెరీనా అబ్రహాం, యాంకర్‌ నేహా చౌదరి, ఆర్జే సూర్య, నటుడు బాలా దిత్య, షాన్ని, సింగర్‌ రేవంత్‌, నటి సుదీప, యాంకర్‌ అరోహీ రావ్‌, సీరియల్‌ నటి శ్రీ సత్య, కీర్తి, ఇనయా సుల్తానా, జబర్దస్త్ ఫహిమా, ఇస్మార్ట్‌ అంజలీ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కంటెస్టెంట్ల వివరాలకు సంబంధించి ఇప్పటివరకు బిగ్‌బాస్ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే షో ప్రారంభం రోజునే కంటెస్టెంట్ల వివరాలను అధికారికంగా ప్రకటిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా అలాగే ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి