బిగ్ బాస్ సీజన్ 6 మూడోవారం కొనసాగుతుంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియతో ఇంట్లో హీట్ పెంచగా.. ఇక ఇప్పుడు టాస్కులోనూ రచ్చ రచ్చ చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో.. మాటల యుద్దం కాదు.. ఏకంగా కొట్టుకోవడానికి సైతం వెనుకాడలేదన్నట్లుగా తెలుస్తోంది (Bigg Boss 6 Telugu). ఈ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా అడవిలో ఆట అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో కొందరు పోలీసులుగా ఉండగా.. మరికొందరు దొంగలు. ఇక ఇంట్లో అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలిగా గీతూ గలాటను చూపించారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో సహనం కోల్పోయి విచక్షణరహితంగా ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో దొంగల బ్యాచ్ లో ఉన్న ఆరోహి కాలుకు గాయం కాగా..ఆమెను సూర్య భుజంపై వేసుకుని లోపలికి తీసుకుని వెళ్లాడు.
అయితే ఆరోహి కాలుకు గాయమవడం.. లోపలికి తీసుకెళ్లడ అంతా స్టాటజీ అంటూ శివాలెత్తింది ఇనయ. దీంతో హౌస్ మేట్స్ అరుస్తూ.. మధ్యలో శ్రీహాన్ వాడు అనేసింది. ఇంకేముందు వాడు ఏంటీ ? నోరు అదుపులో పెట్టుకో అంటూ మరింత రెచ్చిపోయాడు శ్రీహాన్. అతనికి మద్దతుగా సింగర్ రేవంత్ సైతం రెచ్చిపోయాడు. నన్ను కూడా వాడు అన్నావ్. అప్పుడే లాగి పెట్టి కొట్టాల్సింది అంటూ రేవంత్ సీరియస్ కాగా.. నన్ను కొడతావా ? నన్ను కొడతావా ? అంటూ పైపైకి వెళ్లింది ఇనయ. మీ ఇంట్లో మర్యాద నేర్పలేదా ? అంటూ గట్టిగానే అడిగేశాడు రేవంత్. మొత్తానికి ఆట ప్రారంభించలేదు.. ఎవరు సరిగ్గా ఇంట్రెస్ట్ పెట్టడం లేదంటూ నాగార్జున క్లాస్ తీసుకోవడంతో ఈ వారం కెప్టెన్సీ టాస్కులో హౌస్మేట్స్ శ్రుతిమించిపోయినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.