కన్నడ బిగ్ బాస్‌పై కరోనా ఎఫెక్ట్ పడింది. 100 రోజులకు పైగా కొనసాగించాలని ప్లాన్ చేసిన ఈ సీజన్‌ను అర్ధాంతరంగా ముగించారు నిర్వహకులు. ఇంకా ఎనిమిది మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లో ఉండగానే… విన్నర్ ఎవరో తేలకముందే బిగ్ బాస్‌కు గుడ్‌బై చెప్పేశారు. కర్ణాటకలో కేసులు భారీ స్థాయిలో పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న ఈ షో ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. దాదాపు 71 రోజుల పాటు సాగింది. ఇంకా ఎనిమిది మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లో ఉన్నారు. వాళ్లంతా సేఫ్‌గా ఆనందంగానే ఉన్నా… బయటి పరిస్థితుల దృష్ట్యా షోనూ క్యాన్సిల్ చేయాలని నిర్ణయించామని తెలిపారు ఆర్గనైజర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ కలర్స్ కన్నడ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విజేతగా ఎవర్నీ ప్రకటించలేదు. అయితే నెటిజన్లు మాత్రం ప్రశాంత్ సమ్ బర్గీని విన్నర్ గా డిక్లేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నారు.
కన్నడ బిగ్ బాస్ 8 మొదలు పెట్టిన దగ్గర నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. లాస్ట్ ఇయరే స్టార్ట్ కావాల్సిన ఈ షో కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా ఆలస్యమైంది. షో ప్రారంభమైన కొద్ది రోజులకే సుధీప్ ఆరోగ్యం దెబ్బతినటంతో ఆయన కొంతకాలం షోకు దూరంగా ఉన్నారు. తిరిగి సుధీప్ జాయిన్ అయినా… సీజన్ రద్దయ్యింది.
Also Read: 104 వ్యవస్థ మరింత బలోపేతం.. కరోనాపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు