
బిగ్ బాస్ సీజన్ 9.. మరికొన్ని గంటల్లో విన్నర్ ఎవరనేది తేలబోతుంది. టాప్ 5 కంటెస్టెంట్లుగా సంజన, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల నిలిచారు. అయితే ముందు నుంచి ఈసారి సీజన్ విన్నర్ తనూజ అంటూ గట్టిగానే ప్రచారం జరుగుతుంది. కానీ తనూజకు గట్టిపోటీ ఇస్తూ దూసుకోచ్చేశాడు కళ్యాణ్ పడాల. కామనర్ గా అడుగుపెట్టి విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు కళ్యాణ్. తన వ్యూహం మార్చి టాస్కులలో అదరగొట్టి.. మాట తీరుతో జనాలను కట్టిపడేశాడు. హౌస్ లో కళ్యాణ్, తనూజ స్నేహితులుగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే జరుగుతుంది. ప్రేక్షకులతోపాటు అటు సెలబ్రెటీస్ సైతం ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కోసం సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ కు పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్, గౌతమ్ కృష్ణ, సోహేల్, బిందుమాధవితోపాటు.. అగ్నిపరీక్ష టీమ్ మొత్తం కళ్యాణ్ కు సపోర్ట్ ఇస్తుంది. సీరియల్ స్టార్స్ ఎక్కువగా తనూజకు మద్దతు తెలుపుతున్నారు. కానీ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ శ్రీసత్య, యష్మీ మాత్రం ఇన్ స్టా లైవ్ లో తనూజ గురించి సంచలన కామెంట్స్ చేశారు. సత్య నువ్వు ముద్ద మందారంలో యాక్ట్ చేసి కూడా ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు తనూజను చూసి కుళ్లుకుంటున్నావని అర్థమైంది అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. గట్టి కౌంటర్ ఇచ్చింది శ్రీసత్య. “బ్రో.. నువ్వు చూడనిది నేను చూశా.. అందుకే ఇలా మాట్లాడుతున్నా.. జెలసీ అయిపోవడానికి ఏముంది అక్కడ” అంటూ రియాక్ట్ అయ్యింది. ఇక యష్మీ మాట్లాడుతూ.. “జెలసీ గురించి చెప్పాలంటే మా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. కానీ నోరు మూసుకొని ఉన్నామంటే అది మా విజ్ఞత. ఇప్పుడు హౌస్ లో ఉన్నవాళ్లలో కొంతమందిని బయట చూశాను.. వాళ్ల చరిత్ర నాకు తెలుసు.. అందుకే మా సపోర్ట్ కళ్యాణే. అతడి బిహేవియర్ చాలా ఇష్టం ” అంటూ చెప్పుకొచ్చింది.
#SriSatya – “I worked in muddha mandharam show. I know about #thanuja. I have seen what you haven’t seen”
Lady winner personality.. Ladies ke nachatledhu 😊#BiggBossTelugu9 pic.twitter.com/mKbmgw9jZS
— BigBoss Telugu Views (@BBTeluguViews) December 19, 2025
ఎలాంటి గేమ్ ఆడకుండా కేవలం పీఆర్ పెట్టుకోవడం వల్లే.. తనూజ ఇప్పుడు టాప్ లో ఉంది.. అలా పీఆర్ లను పెట్టుకుని తాము కూడా విన్ అయ్యేవాళ్లు. పీఆర్ కోసం అంత ఖర్చు చేసే డబ్బు మా దగ్గర లేదంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి శ్రీసత్య, యష్మీ మాత్రం కళ్యాణ్ కు గెలిపించండి అంటూ చెప్పుకొచ్చారు.
#YashmiGowda and #SriSatya exposed the misuse of the women card.
Only real strength and honesty matter.
Only the best will win.
And clearly, Tanuja doesn’t even deserve a Top 5 spot.#BiggBossTelugu9#KalyanPadala𓃵
👉#VoteForKalyan👈pic.twitter.com/s7rkl90OeB— 🦋𝓚𝓾𝓼𝓾𝓶𝓪🦋 (@KusumaAllada) December 18, 2025
ఇవి కూడా చదవండి : Akhanda 2: అఖండ2లో బాలయ్య కూతురిగా నటించాల్సిన అమ్మాయి ఈమె కాదట.. స్టార్ హీరో కూతురు మిస్సైందిగా..
S8 #Yashmi & S6 #SriSatya tightly slapped women card #ThanujaPuttaswamy #BiggbossTelugu9 pic.twitter.com/HcpFvOIbbd
— BigBoss Telugu Views (@BBTeluguViews) December 18, 2025
ఇవి కూడా చదవండి : Anand Movie : జస్ట్ మిస్.. ఆనంద్ సినిమాను మిస్సైన హీరోయిన్.. దెబ్బకు లైఫ్ మారిపోయేది కదా..