Bigg Boss 9 Telugu : ఆ ఇద్దరిలోనే బిగ్‏బాస్ విన్నర్.. నాగార్జున ముందే తేల్చేసిన హౌస్మేట్స్..

‏బిగ్‌బాస్ సీజన్ 9లో మొదటిసారి సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగింది. రాము రాథోడ్ శనివారమే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆదివారం మరో ఎలిమినేషన్ జరగనుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరు ? బాటమ్ లో ఎవరున్నారు ? అనే ప్రశ్నలు అడుగుతూ హౌస్మేట్స్ అభిప్రాయాన్ని తీసుకున్నారు హోస్ట్ నాగార్జున.

Bigg Boss 9 Telugu : ఆ ఇద్దరిలోనే బిగ్‏బాస్ విన్నర్.. నాగార్జున ముందే తేల్చేసిన హౌస్మేట్స్..
Bigg Boss 9 Telugu (7)

Updated on: Nov 09, 2025 | 4:54 PM

బిగ్‌బాస్ సీజన్ 9.. ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఇప్పటికే శనివారం నాటి ఎపిసోడ్ లో రాము రాథోడ్ స్వయంగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్ లో మరో ఎలిమినేషన్ జరగనుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం భరణి, సాయి శ్రీనివాస్ ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఎపిసోడ్ లో బిగ్‌బాస్ విన్నర్ ఎవరనే ప్రశ్న హౌస్మేట్స్ కు ఇచ్చాడు. మొదటి నుంచి టాప్ 5 కంటెస్టెంట్లలో తనూజ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో సరిగ్గా ఇదే ప్రశ్న అడిగారు నాగార్జున. హౌస్మేట్స్ లో ట్రోఫీకి దగ్గరగా ఎవరు వెళ్తున్నారు.. ? ఎగ్జిట్ కు దగ్గరగా ఎవరు వెళ్తున్నారు ? ప్రతి ఒక్కరు చెప్పాలని అన్నారు నాగ్.

ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..

ముందుగా సుమన్ శెట్టి అయితే ఇమ్మాన్యుయేల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని.. ఎందుకంటే అతడి ఎఫర్ట్ క్లియర్ గా, క్లారిటీ గా కనబడుతుందని అన్నాడు. ఇక శ్రీనివాస్ ఎగ్జిటిక్ దగ్గగా ఉన్నాడని.. టాస్క్ ఏం సరిగా ఆడలేకపోతున్నాడని చెప్పాడు. అలాగే కళ్యాణ్ వచ్చేసి తనూజ విన్నర్ అని..భరణి ఎగ్జిట్ కు దగ్గరగా ఉన్నాడని అన్నారు. ఇక భరణి వచ్చి ఇమ్మూ ట్రోఫీకి దగ్గరగా ఉన్నాడని.. బిగ్ బాస్ హౌస్ లో ఒక ప్లేయర్ ఎలా ఉండాలి గేమ్ పరంగా అంటే తనకు ఇమ్మాన్యుయేల్ బెస్ట్ అనిపిస్తుందని అన్నాడు భరణి. తర్వాత సాయి శ్రీనివాస్ వచ్చి తనూజ విన్నర్.. భరణి ఎగ్జిట్ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

భరణి అటు ఇటు కాకుండా ఎక్కడో ఆగిపోయారని.. ఇప్పుడు కూడా మళ్లీ రిపీట్ అవుతుందని అనిపిస్తుందని చెప్పాడు. ఇక సంజన డీమాన్ పవన్ టఫ్ కాంపిటేషన్ అని.. గౌరవ్ అదొక్కటీ మార్చుకుంటే గేమ్ లో ఎక్కువకాలం ఉంటాడని చెప్పింది. ఇక దివ్య వచ్చేసి ఇమ్మూ విన్నర్ అని.. గౌరవ్ ఎగ్జిట్ అని చెప్పింది. గౌరవ్ ఏదీ సరిగ్గా అర్థం చేసుకోడని దివ్య చెప్పడంతో ఆమె పర్సనల్ రీజన్ అని గౌరవ్ చెప్పడంతో.. నాగార్జున్ క్లాస్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..