Bigg Boss 9 Telugu : ఏందీ అధ్యక్షా ఆ ఆవేశం.. కళ్యాణ్‏పై సుమన్ శెట్టి ఆగ్రహం.. కోడితే కుండ పగిలిపోద్దంతే..

బిగ్ బాస్ సీజన్ 9.. గ్రాండ్ ఫినాలే సమయం దగ్గరపడింది. మరో మూడు వారాల్లో ఈ సీజన్ విజేత ఎవరనేది తెలియనుంది. అయితే ఈసారి మొదటి నుంచి ప్రేక్షకులల మనసులలో స్థానం సంపాదించుకున్న ఏకైక కంటెస్టెంట్ సుమన్ శెట్టి. కానీ ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే సుమన్ శెట్టి.. నిన్నటి ఎపిసోడ్ లో ఆవేశంతో ఊగిపోయాడు.

Bigg Boss 9 Telugu : ఏందీ అధ్యక్షా ఆ ఆవేశం.. కళ్యాణ్‏పై సుమన్ శెట్టి ఆగ్రహం.. కోడితే కుండ పగిలిపోద్దంతే..
Bigg Boss

Updated on: Nov 18, 2025 | 8:13 AM

బిగ్ బాస్ సీజన్ 9లో ఒక్కసారి కూడా నెగిటివిటీ లేకుండా మంచి ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ సుమన్ శెట్టి. మొదటి నుంచి తన ప్రవర్తన, ఆట తీరుతో జనాలకు దగ్గరయ్యాడు. గొడవను సాగదీయకుండా.. పాజిటివ్ ఆటిడ్యూట్ తో ఉంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే హౌస్ లో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సుమన్ శెట్టి.. నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. వరస్ట్ సంచాలక్ గా పేరు తెచ్చుకున్న కళ్యాణ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. అదే ఆవేశంతో వెళ్లి కళ్యాణ్ కుండ పగిలిపోయాడు. టవర్ టాస్కులో సంచాలక్ కళ్యాణ్ డెసిషన్ పై హౌస్ మొత్తం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని చెబుతూ నామినేట్ చేశాడు సుమన్ శెట్టి.

టవర్ స్ట్రైట్ గా ఉండాలని ముందు చెప్పలేదు అని సుమన్ అడగ్గా.. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పాడు కళ్యాణ్. దీంతో సుమన్ శెట్టి ఫైర్ అయ్యాడు. వినూ.. వినూ.. వినూ.. ఇవ్వే వద్దు అంటూ మరింత రెచ్చగొట్టాడు కళ్యాణ్. వినూ అంటూ వేలు చూపిస్తూ పెద్దగా అరుస్తూ సుమన్ శెట్టి మీదకు వెళ్లాడు కళ్యాణ్. దీంతో వేలు దించూ.. ఆ వేలు కిందికి దించూ అంటూ సీరియస్ అయ్యాడు సుమన్. వేలు నీవైపు చూపించడం లేదు.. అని కళ్యాణ్ చెప్పడంతో.. నా వైపు చూపించావ్ కాబట్టే చెప్తున్నా.. అంటూ ఆవేశంగా వెళ్లి కళ్యాణ్ కుండ బద్దలు కొట్టాడు.. సుమన్ శెట్టి ఆవేశం చూసి బిత్తరపోయారు అంతా.

మరోవైపు రీతూ, భరణి మధ్య కూడా సంచాలక్ గురించి హీట్ డిస్కషన్ నడించింది. డిజాస్టర్ సంచాలక్ అంటూ నామినేట్ చేశాడు భరణి. నీవల్ల ఇద్దరి కెప్టెన్సీ ఛాన్స్ పోయింది అని భరణి చెప్పడంతో తెగ యాటిట్యూడ్ చూపించింది రీతూ.. దీంతో కోపంతో.. స్టిక్ కిందపడేసిన భరణి.. నీలాగే స్టెప్పులు వేయగలను అంటూ కౌంటరిచ్చాడు. ఈ వారం దివ్య నిఖిత, డెమాన్ పవన్, సంజన, భరణి, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్ నామినేట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..