
బిగ్ బాస్ సీజన్ 9.. 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ గురించి చెప్పక్కర్లేదు. డీమాన్, కళ్యాణ్ మధ్య గొడవ.. రీతూపై సంజన మాటలు సైతం ఈ వారం హాట్ టాపిక్ అయ్యాయి. సంజన మాటలు రీతూ క్యారెక్టర్ ను కించపరిచేలా ఉన్నాయంటూ హౌస్మేట్స్ సైతం సీరియస్ అయ్యారు. అయినప్పటికీ సంజన ఏమాత్రం తగ్గలేదు. ఇక ఈ వివాదంపై నాగార్జున ఎలా స్పందిస్తారు.. ? అనేది తెలుసుకోవడానికి అడియన్స్ ఎంతగానో ఎదురుచూశారు. కానీ శనివారం నాటి ఎపిసోడ్ లో సండన అందరికీ దిమ్మతిరిగే షాకిచ్చింది. తాను అస్సలు తప్పు చేయలేదని.. అస్సలు సారీ చెప్పనంటూ వాదించింది. హౌస్ వాతావరణం చెడగొట్టినందుకు బయటకు వెళ్లిపోతాను.. కానీ సారీ చెప్పను… నేను చూసింది చెప్పాను.. అంటూ గట్టిగానే వాదించింది. అయినప్పటికీ నాగార్జున వదల్లేదు. దీంతో చివరకు దిగొచ్చిన సంజన ఎట్టకేలక సారీ చెప్పింది.
ఇవి కూడా చదవండి : Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..
ఈ వారం అందరినీ డిస్టర్బ్ చేసిన ఇష్యూ ఏంటని నాగార్జున అడగ్గా.. సంజన, రీతూ గొడవ అంటూ ఇమ్మూ చెప్పాడు. దీంతో సంజన నాకు ఇబ్బందిగా అనిపించింది… పక్క పక్కనే కూర్చోవడం నచ్చలేదు అని చెప్పాను కానీ మరో పదం వాడలేదు కదా అంటూ క్లారిటీ ఇచ్చింది. వాళ్లను చూస్తూ నాకు ఇబ్బంది అనిపించింది కాబట్టి నేనే దుప్పటి కప్పుకున్నా.. నాకు అన్ కంఫర్టబుల్ అనిపించింది చెప్పినా అంటూ తన మాటపైనే నిలబడింది. కానీ అంతకు ముందు రీతూ, పవన్ గురించి తనూజతో సంజన మాట్లాడిన వీడియో ప్లే చేసి చూపించారు నాగార్జున. కావాలని ముందు నుంచి అనుకుని నామినేషన్లలో చెప్పినట్లు ఉందంటూ చెప్పారు. అలాగే డీమాన్ తో నామినేషన్లలో నువ్వు మధ్యలోకి రాకు అని ముందుగా ఎందుకు చెప్పావ్ అని అడిగారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‌లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..
నువ్వు ఇమ్మూ తలకు ఆయిల్ పెట్టావ్.. మరీ అది కూడా చూడటానికి ఇబ్బందిగానే ఉంది కదా.. 1 ఏళ్లు కష్టపడి ఇక్కడి దాకా వచ్చావు కదా. చిన్న షోలు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉండకూడదా ? నువ్వు బయట ఏదో తప్పు చేశావ్ కాబట్టి నీపక్కన ఉండడానికి ఇబ్బందిగా ఉంది అని వాళ్ళంటే నీకు ఎలా ఉంటుంది? నీకు ఇబ్బందిగా ఉంటే బయటకు వెళ్లిపో అని అన్నారు. లేదంటే సారీ చెప్పు అనడంతో.. సారీ చెప్పేందుకు ససేమిరా అంది సంజన. బయటకు వెళ్లిపోతాను. ఇక భరించలేకపోతున్నాను.. అసలు ఉండను అంటూ వాదించింది. మేము త్యాగం చేస్తేనే నువ్వు ఉన్నావు.. ఆ మాటలు విని ఉండడం నా వల్ల కాదు నేను బయటకు వెళ్లిపోతాను అని వేడుకుంది. కానీ అమ్మాయి మీద అంత పెద్ద బ్లాక్ మార్క్ వేసి ఎలా వెళ్తావు అంటూ చివరకు సంజనతో సారీ చెప్పించారు నాగార్జున.
ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..