Bigg Boss 9 Telugu : విన్నర్ ప్రైజ్ మనీకి కోతపెట్టిన డీమాన్.. రూ.15 లక్షల సూట్ కేస్‏తో బయటకు..

బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అయ్యింది. ఓవైపు విన్నర్ ఎవరు కాబోతున్నారనే ఉత్కంఠ సైతం క్షణక్షణం పెరుగుతూనే ఉంది. ఈసారి ట్రోఫీ ఎవరి సొంతం కాబోతుందనే విషయంపై విపరతీమైన బజ్ నెలకొంది. కళ్యాణ్, తనూజ ఇద్దరిలో ఒకరు విన్నర్ కానున్నారు. అయితే ఇప్పుడు రూ.15 లక్షల సూట్ కేస్ తో బయటకు వచ్చాడు పవన్.

Bigg Boss 9 Telugu : విన్నర్ ప్రైజ్ మనీకి కోతపెట్టిన డీమాన్.. రూ.15 లక్షల సూట్ కేస్‏తో బయటకు..
Demon Pawan

Updated on: Dec 21, 2025 | 9:46 PM

బిగ్ బాస్ సీజన్ 9.. గ్రాండ్ ఫినాలే మొదలైంది. గత వారం రోజులుగా ఈ సీజన్ విన్నర్ ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. కళ్యాణ్, తనూజ ఇద్దరిలో ఒకరు ఈ సీజన్ విన్నర్ కానున్నారు. టాప్ 5 స్థానంలో సంజన ఎలిమినేట్ కాగా.. ఎవరు ఊహించని విధంగా నాలుగో స్థానంలో బయటకు వచ్చేశాడు ఇమ్మాన్యూయేల్. సీజన్ మొదటి నుంచి ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తూ.. టాస్కులలో అదరగొట్టేశాడు. అలాగే సోషల్ మీడియా లెక్కల ప్రకారం అత్యధిక ఓటింగ్ తో ఇమ్మాన్యుయేల్ మూడవ స్థానంలో ఉన్నాడు. కానీ బిగ్ బాస్ లెక్కలు వేరు కదా.. అందరికీ ఊహించని విధంగా నాలుగో స్థానంలో బయటకు వచ్చేశాడు.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : తనూజ చెవిలో శ్రీముఖి ఏం చెప్పింది.. ? ఏం లీక్ చేసింది భయ్యా.. నెటిజన్స్ ఆగ్రహం…

ఇదిలా ఉంటే.. టాప్ 3గా డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల, తనూజ ఉన్నారు. వీరిలో ఒకు బయటకు వచ్చారు. మూడవ స్థానంలో డీమాన్ పవన్ బయటకు వచ్చేశాడు. టాప్ 3ని ఆకర్షించేందుకు రూ.15 లక్షల సూట్ కేస్ ప్రైజ్ తో హౌస్ లోకి అడుగుపెట్టారు. భర్త మహశయులకు విజ్ఞప్తి సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతితో కలిసి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు రవితేజ. వీరిద్దరు సూట్ కేస్ తీసుకుని లోపలికి వెళ్లారు. టాప్ 3లో ఉన్నవారిలో ఒకరికి ఈ సూట్ కేస్ ఆఫర్ చేశారు.

ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 55 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా.. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్..

ఈ ఆఫర్ ను కళ్యాణ్, తనూజ రిజెక్ట్ చేయగా.. డీమాన్ ఈ ఆఫర్ తీసుకున్నారు. దీంతో టాప్ 3లో డీమాన్ రూ.15 లక్షల సూట్ కేస్ తో బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు టాప్ 2 కంటెస్టెంట్స్ తనూజ, కళ్యాణ్ మధ్య విన్నర్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి : Tollywood : 11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. అయినా రూ.200 కోట్ల ఆస్తులు.. గ్లామర్ పాటలతోనే ఫేమస్..