Bigg Boss 9 Telugu : కళ్యాణ్, ఇమ్మూ మాస్టర్ ప్లాన్.. రీతూ చేతిలో భరణి ఓటమి.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఆ ముగ్గురిలోనే..

బిగ్‌బాస్ సీజన్ 9... ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ గట్టిగానే పోటీపడుతున్నారు. గత నాలుగు రోజులుగా హౌస్ లో టాస్కులు రసవత్తరంగా సాగుతున్నాయి. ముందు నుంచి టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్న కళ్యాణ్, ఇమ్మూ ఫైనలిస్ట్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. ఇక వీరితోపాటు రీతూ సైతం ఈ రేసులో ఉండడం మరో విశేషం. గురువారం జరిగిన ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందామా.

Bigg Boss 9 Telugu : కళ్యాణ్, ఇమ్మూ మాస్టర్ ప్లాన్.. రీతూ చేతిలో భరణి ఓటమి.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఆ ముగ్గురిలోనే..
Bigg Boss 9 Telugu (15)

Updated on: Dec 05, 2025 | 9:13 AM

బిగ్‌బాస్ సీజన్ 9.. ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది.. ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు గట్టిగానే పోటీ పడుతున్నారు హౌస్మేట్స్. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన డీమాన్ ఈ రేసు నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత కళ్యాణ్, ఇమ్మూ మాస్టర్ ప్లాన్ తో తమకు పోటీ అనుకున్న భరణిని రీతూ చేతిలో ఓడించారు. గురువారం ఎపిసోడ్ లో ఏ జరిగిందో తెలుసుకుందాం. నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణ్, రీతూ, ఇమ్మాన్యుయేల్ మధ్య ఒక టాస్క్ జరిగింది. అందులో కావాలని రీతూ చేతిలో ఇద్దరూ ఓడిపోయారు. ఆ తర్వాత రీతూ, భరణి మధ్య మరో టాస్క్ జరగ్గా అందులో రీతూ గెలిచింది. నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా కళ్యాణ్, రీతూ, భరణి మధ్య కలర్ టాస్క్ జరిగింది. ఇందులో కళ్యాణ్ విన్నర్ అయ్యాడు.

ఆ తర్వాత కళ్యాణ్, సుమన్ శెట్టిని సెలక్ట్ చేసుకున్నాడు. వీరిద్దరికి రెయిజ్ ర్యాంపేజ్ టాస్కు పెట్టగా.. అందులోనూ కళ్యాణ్ విన్ అయ్యాడు. ఆ తర్వాత కళ్యాణ్, ఇమ్మూ ఓ స్కెచ్ వేశారు. భరణి, రీతూ ఇద్దరూ మనకు రిస్క్.. ఇప్పుడు ముగ్గురు గేమ్ ఆడితే.. మనలో ఎవరు గెలిచినా నాగ్ ఓట్ లో ఓడిపోతే ఒంటరివాళ్లం అయిపోతాం అని కళ్యాణ్ అన్నాడు. రీతూ బాధ ఏంటంటే భఱణి వెళ్లిపోతే గేమ్ అప్పుడు నీతో నాతో రేపు ఏదో లక్ లోనైనా ఏదో ఒకటి చేసేయెచ్చు అనుకుంటుంది. ఈరోజు నాగ్ ఔట్ ఆడుకూడదు అనుకుంటుంది అని ఇమ్మూ అన్నాడు.ఆ తర్వాత రీతూ, కళ్యాణ్, ఇమ్మూ మధ్య బ్యాలెన్స్ టాస్కు పెట్టాడు బిగ్‌బాస్ . ఈ టాస్కుకు ముందే కళ్యణ్, ఇమ్మూ ఇద్దరు మాట్లాడుకుని కావాలని ఓడిపోయారు.

బ్యాలెన్సింగ్ టాస్కులో కళ్యాణ్, ఇమ్మూ అనుకున్నట్లుగానే ఇద్దరూ రీతూ చేతిలో ఓడిపోయారు. దీంతో ఆ తర్వాత నాకౌట్ లో భరణిని సెలెక్ట్ చేసుకుంది రీతూ. వీరిద్దరికి రింగ్ మాస్టర్ అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్ . దీనికి సంజన సంచాలక్ కాగా.. ఇందులో రీతూ లక్కీగా గెలిచేసింది. దీంతో భరణి ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి ఔట్ అయిపోయాడు. ఈ టాస్కు తర్వాత తనూజ అసలు ఆట స్టార్ట్ చేసింది. రీతూ పెట్టిన ట్రయాంగిల్స్ లో ఒకటి ట్రయాంగిల్ షేప్ లో లేదంటూ తనూజ మెలిక పెట్టడంతో భరణి సైతం అవునంటూ తలాడించాడు. కానీ అప్పటికే సంజన రీతూను విన్నర్ గా ప్రకటించింది. ఇక శుక్రవారం ఫైనల్ టాస్కులో రీతూ, ఇమ్మూ, కళ్యాణ్ ముగ్గురు పోటీ పడనున్నారు.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..