Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..

బిగ్ బాస్ సీజన్ 9.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. ఈ సీజన్ ముగింపుకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇప్పుడు ఒక్కో కంటెస్టెంట్ ఆట తీరు కంటే ఎక్కువగా ప్రవర్తనపైనే ఆధారపడి అడియన్స్ ఓటింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ లెక్కలు మారిపోయాయి. ఇన్నాళ్లు డేంజర్ జోన్ లో ఉన్న హౌస్మేట్ ఇప్పుడు టాప్ 5లోకి దూసుకువచ్చారు.

Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..
Bigg Boss 9 Telugu (14)

Updated on: Dec 04, 2025 | 11:57 AM

బిగ్ బాస్ సీజన్ 9.. మరికొద్ది రోజుల్లో విజేత ఎవరనేది తెలియనుంది. ఇప్పుడు హౌస్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ కోసం పోటీ జరుగుతుంది. గత రెండు రోజులుగా హౌస్మేట్స్ మధ్య వరుస టాస్కులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు టాస్కులతోపాటు బిహేవియర్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే తమ ఆట తీరుతోపాటు.. ప్రవర్తన, మాట తీరు చూసే ఎవరు టాప్ 5 వరకు ఉండాలనే విషయాన్ని డిసైడ్ చేస్తారు జనాలు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఓటింగ్ లెక్కలు మారిపోయాయి. ఎందుకంటే ఇన్నాళ్లు డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్.. ఇప్పుడు అనుహ్యంగా అత్యధిక ఓటింగ్ తో దూసుకుపోతుంది. ఆమె ఎవరో తెలుసా.. సంజన. గత వారం ఆమె మాట్లాడిన మాటలు, గొడవలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

కానీ గతవారం ఒక్క శనివారం ఎపిసోడ్ తో జనాల తీర్పు మారిపోయింది. హౌస్ లో మొదటి నుంచి రీతూ చౌదరి, డీమాన్ పవన్ ప్రవర్తన జనాలకు విసుగు పుట్టించింది. ఒకరి కోసం ఒకరు గేమ్ ఆడడం.. మాట్లాడితే హక్కులు అంటూ జనాలకు చిరాకు తెప్పించారు. అదే విషయాన్ని నామినేషన్లలో కడిగిపారేసింది సంజన. ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి అలా మాట్లాడతావా అంటూ గట్టిగానే రియాక్ట్ అయ్యారు నాగార్జున. కానీ తనకు అన్ కంఫర్టబుల్ గా ఉందనే విషయాన్ని చెప్పానని.. అందుకు సారీ మాత్రం చెప్పేది లేదని తేల్చీ చెప్పింది సంజన. కావాలంటే బయటకు వెళ్తాను కానీ సారీ మాత్రం చెప్పేది లేదంటూ హోస్ట్ కే చుక్కలు చూపించింది. నేను వెళ్లిపోతాను.. కానీ సారీ చెప్పను.. అంటూ తన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంది. దీంతో చేసేదేమి లేక బిగ్ బాస్, హోస్ట్ నాగార్జున సైలెంట్ అయ్యారు.

ఈ ఒక్క ఎపిసోడ్ తర్వాత సంజన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తనకు అన్ కంఫర్ట్ గా అనిపించిందని మాత్రమే సంజన చెప్పిందని.. అంతేకానీ వాళ్లిద్దరు అలా ఉండడం తప్పని చెప్పలేదని నెటిజన్స్ సంజనకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ తర్వాత సంజన ఓటింగ్ లో టాప్ లోకి వచ్చేసింది. మొన్నటి వరకు డేంజర్ జోన్ లో ఉన్న ఆమె.. ఇప్పుడు అత్యధిక ఓటింగ్ తో టాప్ 5కు దూసుకుపోతుంది. ఈ వారం సుమన్ శెట్టి, డీమాన్, సంజన, రీతూ, తనూజ, భరణి నామినేషన్లలో ఉండగా.. తనూజ టాప్ 1లో దూసుకుపోతుంది. ఆమె తర్వాత సంజన సెకండ్ ప్లేస్ లో రాణిస్తుంది. ఇక తర్వాతీ స్థానాల్లో రీతూ చౌదరి డీమాన్, భరణి, సుమన్ శెట్టి ఉన్నారు. ఈ వారం డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :  Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..