Bigg Boss 9 Telugu ‏: బిగ్‏బాస్ ఓటింగ్‏లో ఊహించని రిజల్ట్.. భరణి జోరు.. అట్టడుగున దివ్య.. డేంజర్‏లో ఆ ముగ్గురు..

గతవారం హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ బయటకు వచ్చారు. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ కాగా.. అడియన్స్ ఓటింగ్ ప్రకారం సాయి శ్రీనివాస్ బయటకు వచ్చాడు. ఇక ఈ వారం ఒక్కరు తప్ప మిగతా కంటెస్టెంట్స్ అందురు నామినేషన్స్ లోకి వచ్చారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ డేంజర్ జోన్ లోకి వచ్చింది.

Bigg Boss 9 Telugu ‏: బిగ్‏బాస్ ఓటింగ్‏లో ఊహించని రిజల్ట్.. భరణి జోరు.. అట్టడుగున దివ్య.. డేంజర్‏లో ఆ ముగ్గురు..
Bigg Boss 9 Telugu

Updated on: Nov 11, 2025 | 4:09 PM

బిగ్ బాస్ సీజన్ 9.. మొదటి నుంచి రణరంగం అంటూ ఆసక్తిని క్రియేట్ చేశారు నాగార్జున. అయితే మొదటి నాలుగైదు వారాలు సరదాగా సాగిన షో… వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత రణరంగంగానే మారింది. కానీ ఆరుగురు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత కాస్త రంజుగా సాగిన ఈ షో ఇప్పుడు మళ్లీ చప్పబడింది. కేవలం ఒక్కరి కోసమే అందరితో గేమ్ ఆడిస్తున్నట్లుగా కనిపిస్తుందని నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఈసారి నామినేషన్స్ కూడా అంతగా ఆసక్తిగా ఏం జరగడం లేదు. ఏదోక చిన్న చిన్న రీజన్స్ చెబుతూ నామినేషన్స్ చేయడం.. బంధాలు అడ్డుపెట్టుకుని మరొకరిని టార్గెట్ చేయడం మాత్రమే జరుగుతుంది. ఈవారం దాదాపు 10 మంది నామినేట్ అయ్యారు.

కళ్యాణ్, రీతూ చౌదరి, గౌరవ్, నిఖిల్, దివ్య, సుమన్ శెట్టి, భరణి, తనూజ, డీమాన్ పవన్, సంజన, నిఖిల్ అందరూ నామినేట్ అయ్యారు. అయితే కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ సైతం నామినేట్ కాగా.. ఓటింగ్ ద్వారా సేవ్ అయ్యాడు. గత రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి.. ఇక ఎప్పటిలాగే బిగ్ బాస్ ముద్దుబిడ్డ తనూజ ఓటింగ్ లో మాత్రం ఉన్నట్టే. ఇకపోతే.. సుమన్ శెట్టి, కళ్యాణ్ ఎలాగూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. సో.. వీరికి ఓటింగ్ ఎక్కువగానే ఉంది. ఆ తర్వాత టాస్కులలో తన స్ట్రాటజీలతో అదరగొట్టేస్తుంది కాబట్టి రీతూకు పాటిజివిటీ ఉంది. అలాగే డీమాన్ పవన్, సంజనలకు ఓటింగ్ బాగానే ఉంది. ఇక గతవారం దివ్య, తనూజ విషయంలో తన పాయింట్స్, కోపాన్ని సరిగ్గా చూపించడంతో భరణిపై సింపతి పెరగడంతో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్. దీంతో వీరంతా ఓటింగ్ లో సేఫ్ ప్లేస్ లో ఉన్నారు.

Bigg Boss

ఇప్పుడు ఎటూ చూసిన డేంజర్ జోన్ లో ఉన్నది గౌరవ్, నిఖిల్, దివ్య. ఇందులో ఇద్దరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. గౌరవ్, నిఖిల్ ఇద్దరూ టాస్కులలో స్ట్రాంగ్. కానీ ప్రతి టాస్కులో అంతగా ఎఫర్ట్ చూపించడంలేదు. లాస్ట్ వీక్ తనూజ, దివ్య కావాలని గౌరవ్ పై విరుచుకుపడడం.. టాస్కులలో తన గేమ్ కోసం గౌరవ్ స్ట్రాంగ్ తన పాయింట్స్ చెప్పడంతో కాస్త పాజిటివిటీ పెరిగిందనే చెప్పాలి. గౌరవ్ కంటే నిఖిల్ టాస్కులలో ఎఫర్ట్ పెడుతున్నాడు. దీంతో నిఖిల్ కు సైతం ఓటింగ్ నెమ్మదిగా పెరుగుతుంది. ఈ వారం అందరి కంటే డేంజర్ జోన్ లో ఉన్నది దివ్య నిఖిత మాత్రమే. గతవారం భరణి కోసం తనూజను పాయింట్ చేస్తూ టాస్కుల నుంచి తొలగించింది. ఇదే విషయాన్ని వీడియోస్ ప్లే చేసి మరీ చూపించారు నాగార్జున. అలాగే దివ్య రాకముందు భరణి ఆట కింగ్ లా ఉండేదని.. ఆమె ఎంట్రీ తర్వాత అతడి ఆట తగ్గిందంటూ డైరెక్ట్ గానే చెప్పాడు నాగ్. దీంతో దివ్య వల్లే భరణి గేమ్ ఎఫెక్ట్ అవుతుందని అడియన్స్ భావిస్తున్నారు.

మరోవైపు బిగ్ బాస్ ముద్దుబిడ్డకు తనూజకు ఎదురుతిరిగింది దివ్య. భరణితో క్లోజ్ గా ఉంటుందని.. అలాగే ఆమెను కావాలని గేమ్స్ నుంచి తప్పించడంతో ఈ వారం దివ్య పై పూర్తిగా నెగిటివిటీ వచ్చేసింది. దీంతో ఆమెను ఎలాగైనా బయటకు పంపించాలని గౌరవ్, నిఖిల్ కు ఓట్స్ గుద్దిపడేస్తున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓటింగ్ ప్రకారం..గౌరవ్, నిఖిల్, దివ్య డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ వారం ఎండింగ్ వరకు టాస్కులు, ఆట తీరుతో ఓటింగ్ మారిన ఊహించలేం.

ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..