బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 క్లైమాక్స్‌కు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. ఆరోజే టైటిల్ విజేత ఎవరో ప్రకటిస్తారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ ను నిర్ణయించడానికి ఆదివారం (డిసెంబర్ 8) రాత్రి 10:30 గంటలకు ఓటింగ్ పోల్ ఓపెన్ అయింది. ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో టాప్ కంటెస్టెంట్ విష్ణు ప్రియ ఎలిమినేట్ అయ్యింది. టైటిల్ ఫేవరెట్ గా హౌస్‌లోకి అడుగు పెట్టిన ఆమె గ్రాండ్ ఫినాలేకు చేరకుండానే బయటకు వచ్చేసింది. దీంతో ఆమె అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. సీజన్ ప్రారంభంలో తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది విష్ణు ప్రియ. ఫిజికల్ టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేసింది. అయితే అదే సమయంలో పృథ్వీరాజ్‌తో లవ్ ట్రాక్ నడపడం చాలా మందికి నచ్చలేదు. అంతేకాదు తన లవ్ విషయాన్ని ఎలాంటి సంకోచం లేకుండా ధైర్యంగా బయటకు చెప్పింది. కానీ పృథ్వీ మాత్రం కేవలం తమది ఫ్రెండ్ షిప్ అని చెప్పాడు. అయినా విష్ణు ప్రియ మారలేదు. తన ఫోకస్ అంతా పృథ్వీపైనే నిలపడంతో గేమ్ దారి తప్పింది. ఫలితంగా ఓటింగ్ శాతం కూడా తగ్గింది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్‌గా కూడా నిలవకుండా బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యిందీ స్టార్ యాంకర్.
బిగ్ బాస్ తెలుగు 8లోకి 12వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన విష్ణుప్రియ హౌస్‌లో 3 నెలలకు పైగా ఉంది. ఇందుకు గానూ రోజుకి రూ. 57,142, వారానికి రూ. రూ. 4 లక్షల చొప్పున బిగ్ బాస్ నిర్వాహకులతో అగ్రిమెంట్ కుదుర్చు కుంది. అలా 99 రోజులకు గానూ విష్ణుప్రియ సుమారు రూ. 57 లక్షలు అందుకున్నట్లు తెలుస్తంది. ఒక వేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువనే విష్ణుప్రియ అందుకుందని చెప్పవచ్చు.
సాధారణంగా బిగ్ బాస్ తెలుగటైటిల్ విన్నర్‌కు రూ. 50 లక్షల వరకు ప్రైజ్ మనీ లభించింది. ఒక్క సీజన్‌లో మాత్రమే ప్రస్తుతం రూ. 54 లక్షల వరకు ప్రైజ్ మనీ ఉంది. దీనిని బట్టి చూస్తే విష్ణుప్రియ 3 నెలల సంపాదన బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విజేత కంటే అధికంగా ఉందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.