నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియలో మరోసారి కంటెస్టెంట్స్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. ముఖ్యంగా సోనియా వర్సెస్ యష్మీ.. ఓ రేంజ్ ఫైట్ జరిగింది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎమోషనల్ గా వాడుకోవాలో సోనియాకు బాగా తెలుసని.. గేమ్ ఆడకుండా.. తన టీమ్ సభ్యులను రెచ్చగొడుతుందని నామినేట్ చేసింది యష్మీ. ఇక సోనియా కూడా తన వెర్షన్ చెప్పగా.. మరోసారి స్ట్రాంగ్ కౌంటరిచ్చింది యష్మీ. ఈవారం నబీల్ ముందుగా సోనియాను నామినేట్ చేస్తూ వరుసగా తన పాయింట్స్ అన్ని క్లారిటీగా చెప్పాడు. “నేను సంచాలక్ గా కన్ఫ్యూజ్ అయ్యాను అన్నావ్.. కానీ బెలూన్ టాస్కులో నువ్వు సంచాలక్ అయినప్పుడు అభయ్ తప్పు చేసినప్పుడు అక్కడే డిస్క్వైలిఫై చేయాల్సింది కదా.. నువ్వు కూడా అక్కడ కన్ఫ్యూజ్ అయ్యావ్ కదా ‘ అంటూ కరెక్ట్ గా అడిగాడు. రూల్ బుక్ అంతగా గట్టిగా చదవి వచ్చి చేస్తుంటే.. చదువుకోండి ఫస్ట్ అంటూ మాకు చదువు రాదన్నట్లుగా మాట్లాడావ్.. నేను బయాస్ట్ సంచాలక్ అని చెప్పి.. పెద్ద గొడవ చేసినవ్.. ఆ తర్వాత నీతో మాట్లాడుతుంటే గట్టి గట్టిగా నా మీద అరిచినవ్.. మళ్లీ అట్లనే నేను మాట్లాడుతుంటే టోన్ టోన్ అంటూ అభయ్, నిఖిల్ నా మీదకు వచ్చారు.. నువ్వు సంచాలక్..నేను కంటెస్టెంట్ గా మాట్లాడుతుంటే వాళ్లెందుకు మధ్యలోకి వస్తారంటూ పాయింట్ టూ పాయింట్ అడిగాడు నబీల్.
మధ్యలోకి మరో ఇద్దరు వస్తున్నప్పుడు నువ్వైనా వాళ్లకు చెప్పాలి అంటూ నబీల్ చేప్తుండగా.. మరి వాళ్లను మధ్యలోకి తీసుకువచ్చింది నువ్వు అంటూ ఏదేదో మాట్లాడింది సోనియా. దీంతో నేను మాట్లాడుతుంటే.. నువ్వు హైదరాబాద్ అంతా తిప్పి తీసుకురాకు అంటూ కౌంటరిచ్చాడు. ఆ తర్వాత ఫెయిల్డ్ సంచాలక్.. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అంటూ గట్టి గట్టిగా అరిచింది సోనియా. దీంతో నబీల్ కూడా గట్టిగానే కౌంటరిచ్చాడు. దీంతో నిఖిల్, పృథ్వీ మరోసారి మధ్యలోకి వచ్చి నబీల్ తో వాదించారు. దీంతో నిఖిల్ నీదా నామినేషన్ నాదా.. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావ్ అని అడిగాడు. అయినా నిఖిల్, పృథ్వీ ఏమాత్రం ఆగకుండా నబీల్ తో వాదించడంతో బిగ్ బాస్ కు కంప్లైయింట్ చేశాడు నబీల్. అప్పుడు మధ్యలోకి వచ్చారు.. ఇప్పుడు మధ్యలోకి వస్తున్నారని చెప్పాడు నబీల్.
సోనియా తర్వాత రెండో నామినేషన్ పృథ్వీకే వేశాడు. టాస్కులో కోపంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావ్.. నేను బయాస్ట్ సంచాలక్ అని అన్నావ్.. టాస్క్ గురించి కాకుండా నా టోన్ గురించి మాట్లాడినవ్ అంటూ రీజన్స్ చెప్తుండగా.. మధ్యలోకి వచ్చేసింది సోనియా. దీంతో పృథ్వీతో మాట్లాడుతుందే సోనియా ఎందుకు వస్తుందని అడిగాడు నబీల్. ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని నబీల్ చెప్పాడు. ఆ తర్వాత సోనియాపై యష్మీ కూడా ఫైర్ అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.