Bigg Boss 8 Telugu: కోడిగుడ్ల కోసం హౌస్‏లో కోట్లాట.. బూతులతో రెచ్చిపోయిన పృథ్వీ.. మణికంఠ ఏడుపు..

|

Sep 19, 2024 | 6:58 AM

ఎన్నిసార్లు వాడుకున్నా సరే 14 గంటలు అయిపోతే ఆ వారం ఇక నో కిచెన్ అన్నాడు బిగ్‏బాస్. ఇక ఆ తర్వాత హౌస్ లోకి ప్రభావతి 2.0 ఎంట్రీ ఇచ్చింది.. అప్పుడప్పుడు గుడ్లను పంపిస్తాను.. వాటిని జాగ్రత్తగా కాపాడాలి. ఏ టీమ్ అయితే ఎక్కువ గుడ్లు తిరిగి ఇస్తారో వాళ్లకు కొన్ని ప్రయోజనాలు లభిస్తాయని చెప్పింది ప్రభావతి.

Bigg Boss 8 Telugu: కోడిగుడ్ల కోసం హౌస్‏లో కోట్లాట.. బూతులతో రెచ్చిపోయిన పృథ్వీ.. మణికంఠ ఏడుపు..
Bigg Boss 8 Telugu
Follow us on

బిగ్‏బాస్ హౌస్‏లో ప్రభావతి అలియాస్ కోడిగుడ్డు టాస్క్ మళ్లీ రిపీట్ అయ్యింది. గత ఐదో సీజన్‏లో ఈ టాస్క్ పెట్టగా.. ఇప్పుడు మరోసారి తీసుకువచ్చాడు బిగ్‏బాస్. ఈ టాస్కులో లాక్కొవడాలు కాదు.. ఏకంగా కిందపడేసి కొట్టుకున్నంత పనిచేశారు హౌస్మేట్స్. హౌస్ లో నిఖిల్ (శక్తి టీమ్), అభయ్ (కాంతార) టీమ్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వారం ఎక్కువ టాస్కులో గెలవడంతో శక్తి టీంకు సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేసే ఛాన్స్ రాగా.. కాంతార టీంకు జనరల్ స్టోరీ లో షాపింగ్ చేసుకోవాలని చెప్పాడు. అయితే శక్తి టీంకు నాన్ వేజ్ ఎక్కువగా రాగా..కాంతార టీం వెజిటేబుల్స్ తో సరిపెట్టుకున్నారు. అయితే ఇక పై హౌస్ లో 14 గంటలే కిచెన్ ఓపెన్ లో ఉంటుందని చెప్పాడు. ఎన్నిసార్లు వాడుకున్నా సరే 14 గంటలు అయిపోతే ఆ వారం ఇక నో కిచెన్ అన్నాడు బిగ్‏బాస్. ఇక ఆ తర్వాత హౌస్ లోకి ప్రభావతి 2.0 ఎంట్రీ ఇచ్చింది.. అప్పుడప్పుడు గుడ్లను పంపిస్తాను.. వాటిని జాగ్రత్తగా కాపాడాలి. ఏ టీమ్ అయితే ఎక్కువ గుడ్లు తిరిగి ఇస్తారో వాళ్లకు కొన్ని ప్రయోజనాలు లభిస్తాయని చెప్పింది ప్రభావతి.

ఇక ఈ టాస్కులో పృథ్వీ రెచ్చిపోయాడు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ఒక్కొక్కరిని దూరంగా విసిరేసాడు. పృథ్వీని ఆపేందుకు నబీల్, అభయ్, ఆదిత్య ముగ్గురు ట్రై చేయగా.. పృథ్వీ మరింత రెచ్చిపోయాడు. ఆదిత్య మెడ పట్టుకుని పక్కకు విసిరేయగా.. ఇది కరెక్ట్ కాదంటూ ఆదిత్య గొడవ పెట్టుకున్నాడు. అయితే పృథ్వీ అదేం పట్టించుకోలేదు.. మరోవైపు సోనియా మాత్రం అతడిని కమాన్ అంటూ మరింత ప్రోత్సాహించింది. ఇక మధ్యలో బ్రేక్ రావడంతో తన టీం మెంబర్స్ తో పృథ్వీ గురించి తిడుతూ చెప్పాడు అభయ్. గేమ్ కోసం పానం పోయినా ఆగడు..వరస్ట్ ప్లేయర్.. కామన్ సెన్స్, బ్రెయిన్ వాడని ప్లేయర్ అంటూ సీరియస్ అయ్యాడు అభయ్. ఇక అభయ్ దాచుకున్న గుడ్లను లాగేందుకు ట్రై చేశాడు పృథ్వీ. దీంతో ఇది చాలా తప్పు అంటూ ఆదిత్య అనడంతో బూతులు స్టార్ట్ చేశాడు పృథ్వీ.. అలా మాట్లాడొద్దు అంటూ ఆదిత్య వార్నింగ్ ఇస్తున్నా అదేం పట్టించుకోకుండా మరిన్ని బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయాడు పృథ్వీ. మరోవైపు యష్మీ ఏకంగా టీషర్ట్ లో గుడ్లు దాచేసింది.

ఇక ఈ గేమ్ లో నిఖిల్ తోసేయడంతో మణికంఠ కిందపడిపోయి కాసేపు లేవలేదు. దీంతో అతడిని మెడికల్ రూంకు పిలిచాడు బిగ్‏బాస్. ఆ తర్వాత వచ్చి ఆడతాను అని చెప్పినా అభయ్ ఒప్పుకోలేదు. దీంతో ఒంటరిగా కూర్చుని ఏడుపు స్టార్ట్ చేశాడు. బయట నిన్ను నమ్ముకొని ఇద్దరు ఉన్నారు.. ఇక్కడ గేమ్ ఒక్కటే ముఖ్యం కాదు అని అభయ్ చెప్పగా.. వాళ్లిద్దరిని తెచ్చుకోవడానికి ఈ షోకు వచ్చాను.. భార్య, బిడ్డ కావాలంటే నేను ఈ షో విన్ అవ్వాలి అంటూ ఏడ్చేశాడు మణికంఠ. ఇక ప్రభావతి 2.0 టాస్కులో శక్తి టీం 66 గుడ్లు సేవ్ చేయగా.. కాంతార టీం దగ్గర 34 మాత్రమే ఉన్నాయి. దీంతో కాంతార టీం నుంచి ఒకరిని తొలగించాలని చెప్పగా.. నబీల్ ను తొలగించింది శక్తి టీం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.