Bigg Boss 8 Telugu Highlights: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ వీరే..

|

Sep 01, 2024 | 10:53 PM

Bigg Boss Telugu season 8 live updates: బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. ఆదివారం (సెప్టెంబర్ 1) సాయంత్రం గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ అట్టహాసంగా జరగనుంది. ఓపెనింగ్ ఎపిసోడ్ లో భాగంగా స్టార్ హీరోయిన్ల డ్యాన్స్ పెర్ఫామెన్స్ లు కూడా ఉండనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి

Bigg Boss 8 Telugu Highlights: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ వీరే..
Bigg Boss 8 Telugu Grand Launch

Bigg Boss Telugu season 8 Highlights: బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. ఆదివారం (సెప్టెంబర్ 1) సాయంత్రం గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ అట్టహాసంగా జరగనుంది. ఓపెనింగ్ ఎపిసోడ్ లో భాగంగా స్టార్ హీరోయిన్ల డ్యాన్స్ పెర్ఫామెన్స్ లు కూడా ఉండనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ను ఆడియెన్స్ కు పరిచయం చేయనున్నారు. మరి ఎనిమిదో సీజన్ లో హౌస్ లో అడుగు పెట్టే కంటెస్టెంట్స్ ఎవరు? థీమ్ ఎలా ఉండబోతుందనే విషయాలు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే టీవీ9 తెలుగు లైవ్ బ్లాగ్ ను ఫాలో అవ్వండి.

బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూశారా?..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Sep 2024 10:31 PM (IST)

    బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది వీళ్లే..

    •  యష్మీ గౌడ (సీరియల్ నటి)
    • నిఖిల్ మలియక్కల్ (సీరియల్ నటుడు)
    • అభయ్ నవీన్ (నటుడు, యూట్యూబర్)
    • ప్రేరణ కంభం (సీరియల్ నటి)
    • ఆదిత్య ఓం (నటుడు)
    • సోనియా ఆకుల (నటి)
    • బెజవాడ బేబక్క (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్)
    • శేఖర్ బాషా (ఆర్జే)
    • కిర్రాక్ సీత (యూట్యూబర్)
    • నాగ మణికంఠ (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్)
    • అఫ్రిదీ (యూట్యూబర్)
    • విష్ణు ప్రియ (యాంకర్)
    • నైనిక (ఢీ డ్యాన్సర్)
    • పృథ్వీరాజ్ (నాగ పంచమి సీరియల్)
  • 01 Sep 2024 10:17 PM (IST)

    14వ కంటెస్టెంట్ గా వరంగల్ యూట్యూబర్..

    వరంగల్‍కు చెందిన యూట్యూబర్ నబీల్ ఆఫ్రిది.. బిగ్‍బాస్ హౌస్‍లోకి 14వ కంటెస్టెంట్‍గా అడుగుపెట్టారు. డ్యాన్సర్ నైనికకు జోడీగా హౌస్‍లోకి వెళ్లాడు నబీల్ ఆఫ్రిదీ..

  • 01 Sep 2024 10:07 PM (IST)

    13వ కంటెస్టెంట్ గా ఢీ ఫేమ్ నైనిక

    బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో 13వ కంటెస్టెంట్‍గా అడుగుపెట్టింది ప్రముఖ డ్యాన్సర్ నైనిక. ఢీ షోతో ఈమె పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

  • 01 Sep 2024 09:39 PM (IST)

    స్టార్ యాంకర్ విష్ణు ప్రియ వచ్చేసింది..

    నటుడు పృథ్వీకి జోడీగా  స్టార్ యాంకర్ విష్ణుప్రియ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  మిస్టర్ బచ్చన్ సినిమాలోని నల్లంచు తెల్ల చీర పాటతో అదిరిపోయే డ్యాన్స్‌తో విష్ణు ప్రియ బిగ్ బాస్ స్టేజ్ ను దడదడలాడించింది.

  • 01 Sep 2024 09:37 PM (IST)

    11వ కంటెస్టెంట్ గా పృథ్వీరాజ్..

    బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ 11వ కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్ ఎంట్రీ ఇచ్చాడు. హౌజ్‌లో లిమిట్‌లెస్‌గా ఏం కావాలని అతన్ని అడిగితే.. బయట నుంచి ఆడియెన్స్ ఆదరాభిమానాలు కావాలని చెప్పాడీ నటుడు.

  • 01 Sep 2024 09:08 PM (IST)

    కిర్రాక్ సీతకు జోడీగా మణికంఠ

    కిర్రాక్ సీతకు బడ్డీగా నాగ మణికంఠ పదో కంటెస్టెంటుగా  బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ మణికంఠ. చిన్నప్పుడే తన నాన్న చనిపోయాడని, ఆ తర్వాత తన తల్లి రెండో పెళ్లి చేసుకున్నట్లు మణికంఠ ఎమోషనల్అయ్యాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు తన తల్లి క్యాన్సర్‌తో మరణించినట్లు చెప్పాడు మణికంఠ.

  • 01 Sep 2024 08:49 PM (IST)

    బేబీ సినిమా నటి కిర్రాక్ సీత వచ్చేసింది..

     బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ తొమ్మిదో కంటెస్టెంట్‌గా బేబీ మూవీ ఫేమ్ కిర్రాక్ సీత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బేబీ సినిమాలో ఆమె హీరోయిన్ కు స్నేహితురాలిగా నటించింది.

  • 01 Sep 2024 08:39 PM (IST)

    అప్పుడే వార్నింగులు ఇస్తోన్న ఆర్జే శేఖర్ బాషా

    ‘నాతో ఫ్రెండ్లీగా ఉంటే ఓకే.. లేకుంటే  బిగ్ బాస్  టైటిల్ పట్టుకెళ్లిపోతా’ అని తోటి కంటెస్టెంట్స్ కు వార్నింగ్ ఇస్తున్నాడు ఆర్జే శేఖర్ బాషా. రాజ్ తరుణ్- లావణ్య వివాదంతో బాగా ఫేమస్ అయిన అతను బి గ్ బాస్ హౌజ్ లో ఎనిమిదో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు.

     

  • 01 Sep 2024 08:31 PM (IST)

    ఏడో కంటెస్టెంట్ గా బెజవాడ్ బేబక్క

     బిగ్ బాస్  హౌజ్‌లోకి ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చింది. స్టేజ్ మీదకు రా గానే తనకు అలవాటైన రీతిలో నాగార్జునను పొగడ్తలతో ముంచెత్తింది బేబక్క.

  • 01 Sep 2024 08:26 PM (IST)

    ఆరో కంటెస్టెంట్ గా ఆర్జీవీ హీరోయిన్ వచ్చేసింది

    హీరో ఆదిత్య ఓంకి బడ్డీగా ఆర్జీవీ హీరోయిన్‌ సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది. రాగానే తెలంగాణ స్లాంగ్‌తో స్టేజ్ ను అదరగొట్టిందీ అందాల తార. సోనియా దిశా, కరోనా వైరస్ తదిర సినిమాల్లో నటించి మెప్పించింది.

     

  • 01 Sep 2024 08:21 PM (IST)

    ఆదిత్య ఓం వచ్చేశాడు..

     బిగ్ బాస్ ఎనిమిదో సీజన్  ఐదో కంటెస్టెంట్‌గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు. లాహిరి లాహిరి సినిమాతో బాగా ఫేమస్ అయిన ఈ నటుడు ఇటీవల సినిమాలు బాగా తగ్గించాడు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలు చెబుతూ ఎమోషనలయ్యాడీ హ్యాండ్సమ్ హీరో.

  • 01 Sep 2024 08:19 PM (IST)

    బిగ్ బాస్ స్టేజ్ పైకి నాని, రానా దగ్గుబాటి

    బిగ్ బాస్ స్టేజీపైకి నాని, ప్రియాంక మోహన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లకు ఆసక్తికర ప్రశ్నలు వేశాడు హోస్ట్ నాగార్జున.  వీరిద్దరూ సరిపోదా శనివారం సినిమాలో జంటగా నటించారు.

     

     

  • 01 Sep 2024 07:55 PM (IST)

    నాలుగో కంటెస్టెంట్ గా హీరోయిన్ ఎంట్రీ

    అభయ్ నవీన్‌కు బడ్డీగా కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  రొమాంటిక్‌ సాంగ్‌లతో ఆమె దుమ్మురేపింది. అనంతరం చలాకీగా సమాధానాలు చెబుతూ అలరించింది. ఆమెకి పెళ్లై ఎని…

  • 01 Sep 2024 07:43 PM (IST)

    అభయ్ నవీన్ ఎంట్రీ అదిరింది.

    ‘పెళ్లి చూపులు’ సినిమాతో విష్ణుగా పాపులరైన తెలుగు నటుడు అభయ్ నవీన్. పలు సినిమాల్లో నటుడిగా, ‘రామన్న యూత్’తో హీరోగా – దర్శకుడిగా కొత్త అడుగు వేసిన అభయ్… ఇప్పుడు ‘బిగ్ బాస్ 8’లో అడుగు పెట్టారు.

  • 01 Sep 2024 07:37 PM (IST)

    రెండో కంటెస్టెంట్ గా నిఖిల్..

    ఈ సీజన్‌లో సోలో ఎంట్రీ లేదని, తన బడ్డీస్‌ను సెలెక్ట్ చేసుకోవాలని యశ్మీకి నాగ్  సూచించాడు. దాంతో ఒక రెడ్ కలర్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంది  యశ్మీ. దాని నుంచి సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్ ఎంట్రీ ఇచ్చాడు.

  • 01 Sep 2024 07:15 PM (IST)

    బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మొదటి కంటెస్టెంట్ గా నటి యష్మీ గౌడ

    ‘స్వాతి చినుకులు’, ‘నాగభైరవి’, ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్స్ ఫేమ్ యష్మీ గౌడ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో మొదటి కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది. నాగార్జున ఆమెను ఆడియెన్స్ కు పరిచయం చేశారు.

     

     

  • 01 Sep 2024 07:09 PM (IST)

    నాగార్జున గ్రాండ్ ఎంట్రీ

    బిగ్‍బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్ గా కింగ్ నాగార్జున ఎంట్రీ అదిరింది. దేవర ఫియర్ సాంగ్‍కు డ్యాన్స్‌తో ఆయన ఎంట్రీ ఇచ్చారు. లిమిట్‍లెస్ అంటూ ఈ షోను మొదలుపెట్టేశారు.

  • 01 Sep 2024 07:04 PM (IST)

      బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్ కి నాగార్జున బంపర్ ఆఫర్..

     బిగ్ బాస్‌ ఫ్యాన్స్ బంపర్‌ ఆఫర్ ప్రకటించారు హోస్ట్ నాగార్జున. బిగ్ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ కాసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీవీతోపాటు సోషల్‌ మీడియాలో సందడి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్ కి  ఈ మంచి అవకాశాన్ని ఇచ్చారు. బిగ్‌ బాస్‌కి సంబంధించిన మీకు నచ్చిన మూమెంట్స్ ని బిగ్‌ బాస్‌ తెలుగు 8 యాష్‌ ట్యాగ్ తో  సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే అందులో తనకు నచ్చిన వాటిని స్క్రీన్‌పై చూపిస్తానని నాగ్ వెల్లడించారు.  తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయాన్ని పంచుకున్నారు నాగార్జున.
  • 01 Sep 2024 07:01 PM (IST)

    బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్

    బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ మెయిన్ లిస్ట్

     

    1. నిఖిల్ మలియక్కల్
    2. యూట్యూబర్ అఫ్రిది
    3. యష్మీ గౌడ
    4. నైనిక
    5.. ఆదిత్య ఓం
    6. యాంకర్ విష్ణు ప్రియ
    7. కిరాక్ సీత
    8. అభయ్ నవీన్
    9. ప్రేరణ కంభం
    9. ఆర్జే శేఖర్ బాషా
    10. సోనియా ఆకుల
    11. జబర్దస్త్ రాకేష్
    12. నాగ పంచమి హీరో పృథ్వీరాజ్
    13. బెజవాడ బేబక్క
    14. నాగ మణికంఠ

  • 01 Sep 2024 06:29 PM (IST)

    ఈసారి అంతకు మించి..

    కాగా బిగ్ బాస్  సీజన్ 8 ప్రైజ్ మనీలో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. ఈసారి 50 లక్షల రూపాయలు కాదని, విజేతగా నిలిచిన వ్యక్తికి అంతకు మించి ఎక్కువ గానే అమౌంట్ అందే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.

     

  • 01 Sep 2024 06:13 PM (IST)

    ఈసారి హౌస్‍లో మూడు బెడ్రూమ్‍లు

    బిగ్‍బాస్ తెలుగు 8 హౌస్‍లో మూడు బెడ్రూమ్‍లు ఉంటాయని తెలుస్తోంది. జంతువుల పేర్లతో ఉండే ఈ రూమ్‍ల డిజైన్, అందులోని వస్తువులు కూడా అదే విధంగా ఉంటాయని తెలుస్తోంది.

Follow us on