స్నేహితులే తన బలం అనుకున్నాడు. ఎప్పుడూ తనకు వెన్నంటి ఉండి సపోర్ట్ ఇస్తారనుకున్నాడు. ఫ్రెండ్స్ కోసం తన ఆటను పక్కన పెట్టేశాడు. చివరకు ఇప్పుడు ఫ్రెండ్స్ చేతిలోనే ఓడిపోయాడు. అందరూ కలిసి ముకుమ్మడిగా టార్గెట్ చేయడంతో విలవిలలాడిపోయాడు. వద్దురా. వద్దురా.. మీకు దండం పెడతానురా.. అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. అమర్ దీప్ ఏడుస్తుంటే ఇటు ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కెప్టెన్ కావడం కోసం కష్టపడి చివరి వరకు వచ్చి గెలుపుకు అడుగు దూరంలో ఉండిపోవడంతో అమర్ గుండెలు బాదుకున్నాడు. అమర్ దీప్ ఏడవడం చూస్తుంటే చాలా మందికి బాధ అనిపించింది. మొదటి నుంచి తనవాళ్లే అనుకున్న స్నేహితులు అమర్ కెప్టెన్ కావడం కోసం మాత్రం సపోర్ట్ చేయకపోవడంతో అతని బాధ వర్ణనాతీతం. అయితే అమర్ బాధను కొందరు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గెలవలేక ఏడుస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తూ అతడి కన్నీళ్లను, బాధను కూడా ట్రోల్ చేస్తూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అమర్ దీప్ బాధను ఎలా ట్రోల్ చేస్తున్నారా ?.. మీరు అసలు మనుషులేనా ?.. అంటూ అమర్ దీప్ స్నేహితుడు , జానకి కలగనలేదు నటుడు నరేష్ లొల్ల తన ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేశాడు.
“మనషులేనా మీరు అసలు.. సిగ్గుండాలి. ఎమోషన్స్ ను ట్రోల్ చేయడమేంట్రా ?. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్కులో తనవల్ల లాభం పొందినవాళ్లే తనను టార్గెట్ చేయడం..తన ఫ్రెండ్స్ అనుకున్నవాళ్లే తనను టార్గెట్ చేసినప్పుడు.. అంత రిక్వెస్ట్ చేసినా కూడా వదలనప్పుడు వచ్చిన ఎమోషన్ అది. గెలుపు అనేది ఒక్క అడుగు దూరంలో ఉన్నప్పుడు తన అనుకున్నవాళ్ల వల్లే ఆ గెలుపుకు దూరమవుతున్నప్పుడు అప్పుడు ఎంత బాధపడి ఉంటాడు.. ఎంతో లో ఫీల్ అయ్యి ఉంటాడు. దాని వల్ల వచ్చిన ఎమోషన్ అది. దాంతోపాటు బయట తన జీవితంలో వచ్చిన పరిస్థితులు.. నీతోనే డాన్స్ కోసం ఎంత కష్టపడ్డాడు.. ఫైనల్ విన్నర్ తనే అని స్టేజ్ ఎక్కినప్పుడు తనని కాకుండా వేరే వాళ్లని విన్నర్ చేసినప్పుడు తను పడ్డ బాధ.. అన్ని విషయాలు కనెక్ట్ చేసుకుని అమర్ బాధపడ్డాడు.
#GauthamKrishna Amar emotions ni strategy anukoni inka rechagottadu.
After that “#Priyanka ni captain avanivadu ani cheppu apesta andam” -> too much.
Antaku minchi limit cross ayi “unwanted” words kuda use chesadu. Unacceptable. 👎#BiggBossTelugu7 #Amardeep pic.twitter.com/5f0JaBPkef— BiggBossTelugu7 (@TeluguBigg) November 17, 2023
ఒక్కొక్కరు ఒక్కో విధంగా తన ఫీలింగ్స్ బయటపెడతారు. తన ఎమోషన్స్ ను జడ్జ్ చేయడానికి మనం ఎవరం ? దయచేసి గేమ్ గేమ్ లా చూడండి. కెప్టెన్సీ టాస్కులో అమర్ ఆడింది గేమ్ మాత్రమే కాదు.. తన బాధ.. తన ఎమోషన్ బయటపెట్టాడు. దయచేసి తన బాధను ట్రోల్ చేయకండి. అర్థం చేసుకోండి. ట్రోల్ చేసి ఇది డ్రామా అని చెప్పకండి. మానవత్వం ఇంకా ఉందని నిరూపించండి.ప్లీజ్ ” అంటూ చెబుతూ.. అమర్ వెనక జరిగిన మోసం గురించి కళ్లకు కట్టినట్లుగా ఓ వీడియో చూపించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.