బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి ప్రియాంక జైన్. అంతకు ముందు మౌనరాగం జానకి కలగనలేదు సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిందీ అందాల తార. బిగ్ బాస్ ఏడో సీజన్‌లో తన ఆటతీరు, మాటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియాంక. ఈ నేపథ్యంలో గ్రాండ్ ఫినాలేకు దూసుకెళ్లిన ఏకైక లేడీ కంటెస్టెంట్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఎప్పుడూ సరదాగా ఉండే ప్రియాంక జైన్ ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఆమె తల్లి ఫార్గుణి జైన్‌కి ప్రాణాంతకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని ప్రియాంకే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందరితో పంచుకుంది. ‘మీరు చూస్తుంది మా అమ్మనే. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో ఉన్నారు. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత.. నా జీవితం మొత్తం మారిపోయింది. నా వాళ్లతో కలిసి బెంగుళూరు వచ్చి సంతోషంగా ఉందాం అని అనుకున్నాను. నా ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని అనుకున్న టైంలో మా అమ్మకి ఇలాంటి దీన పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రస్తుతం అమ్మకి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో ఉంది. ‘
‘ మా అమ్మకు పీరియడ్స్‌తో సంబంధం లేకుండా రక్తస్రావం అవుతూ వస్తోంది. వయసు పైబడింది కదా ఇలాగే అవుతుందిలే అని అమ్మ అనుకుంది. నేను కూడా చాలా నిర్లక్ష్యం చేశాను. చాలా నార్మల్ అని అనుకున్నారు. అయితే నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆస్పత్రికి తీసుకుని వెళ్లి పరీక్షలు చేయించాను. అందులో ఆమెకి క్యాన్సర్ అని తేలింది. సమస్య వచ్చినప్పుడే డాక్టర్‌కి చూపించి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. నేను బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లకుండా ఉండి ఉంటే అమ్మకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు అమ్మకి లాప్రోస్కోపీ సర్జరీ చేసి గర్భాశయాన్ని తొలగించనున్నారు. అమ్మ త్వరలోనే తిరిగి కోలుకుంటుంది. మా అమ్మ శివంగిలా మళ్లీ తిరిగి వస్తుందని కోరుకుంటున్నాను’ అని ఎమోషనలైంది ప్రియాంక. ప్రస్తుతం ఈవీడియో సామాజి కమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రియాంక తల్లి త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.