బిగ్‌బాస్ సీజన్ 7.. ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. ఫస్ట్ నుంచి చెప్తున్నట్లుగానే ఈసారి ఆట అంతా ఉల్టా పుల్డాగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈసారి కేవలం 14 మందితోనే ఆట మొదలుపెట్టాడు బిగ్‌బాస్. అందులో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు హౌస్ లో 12 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఎప్పటిలాగే కాకుండా ఈసారి హౌస్ కంటెండర్ అయ్యేందుకు పోటీ పెట్టాడు బిగ్‌బాస్. ఇప్పటికే పవర్ అస్త్ర గెలుచుకుని సందీప్ మొదటి కంటెండర్ కాగా.. ఆ తర్వాత రెండవ కంటెండర్‌గా శివాజీ నిలిచాడు. ఇక ఇప్పుడు మూడో కంటెండర్ అయ్యేందుకు పోటీ పడుతున్నారు కంటెస్టెంట్స్. అమర్దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌లను బిగ్‌బాస్ స్వయంగా సెలక్ట్ చేయగా.. ఇప్పుడు ఆ ముగ్గురి మధ్య పోటీ పెడుతున్నాడు.
ఇక బిగ్‌బాస్ ఈ ముగ్గురిని ఎంచుకోవడంతో హౌస్మేట్స్ చాలా మంది డల్ అయిపోయారు. ఇప్పటికే ప్రశాంత్ గుక్కపట్టి ఏడవగా.. మిగతా కంటెస్టెంట్స్ తమ అభిప్రాయాలను బయటపెట్టారు. ఇక ప్రిన్స్ యావర్ కంటెండర్ కావడం ఇష్టంలేని వాళ్లు అతని సహనాన్ని పరీక్షించాలని అన్నారు. ఈ క్రమంలో యావర్ ముఖంపై గుడ్లు, పేడ, గడ్డి, ఐస్ ఇలా అన్నింటిని కొట్టారు. చివరకు సైకోలుగా మారి యావర్ నోట్లో పేడ కుక్కారు. అయినా అన్నింటిని భరించిన యావర్ చివరకు విన్నర్ అయ్యాడు.
ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో చికెన్ తినిపించి మరీ శోభాకు చుక్కలు తినిపించాడు బిగ్‌బాస్. అత్యంత ఎక్కువ కారం ఉన్న చికెన్ ఇచ్చి వాటిని తిని తాను అర్హురాలినే అని విషయాన్ని ప్రకటించుకోవాలని అన్నారు బిగ్‌బాస్. ముందుగా ఎంతో కాన్ఫిడెంట్ గా చికెన్ తినడానికి రెడీ అయిన శోభా ఆ తర్వాత కారం భరించలేక కన్నీళ్లు పెట్టుకుంది. ఏడుస్తూనే కారం చికెన్ తినడానికి ప్రయత్నించింది. ఏడ్వను అని అమ్మకు మాటిచ్చాను కానీ తప్పడం లేదు అంటూ మాట్లాడుతునే మంట భరించలేక అల్లాడిపోయింది. చివరకు కారం తగ్గించుకునేందుకు టిష్యూను నోటిలో పెట్టుకుని మంట తగ్గించేందుకు ప్రయత్నించింది. ఇక శోభా టాస్క్ తర్వాత ఆమెను అనర్హురాలు అని చెప్పిన ప్రశాంత్, శుభ శ్రీ, గౌతమ్‌లకు మళ్లీ చికెన్ టాస్క్ ఇచ్చారు.
ఈ ముగ్గురిలో చికెన్ తినాలని టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఎవరైతే ముందుగా చికెన్ ముక్కలను కంప్లీట్ చేస్తారో..వారు శోభా స్థానంలో కంటెండర్ అవుతారని ప్రకటించారు బిగ్‌బాస్. దీంతో శుభా శ్రీ, ప్రశాంత్, గౌతమ్ పోటీపడి చికెన్ తిన్నారు. అయితే ఈ పోటీలో శోభా గెలుస్తుందా ?. లేదా ఆ ముగ్గురిలో ఒకరు శోభా స్థానంలోకి వెళ్తారా? అనేది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.