బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్‌లో ఎన్నో ఎమోషన్స్. నిన్న శివాజీ కొడుకు.. అశ్విన్ వాళ్ల అమ్మ, అర్జున్ అంబటి వైఫ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. డాక్టర్‌గా వచ్చిన తన కొడుకును చూసి ఎమోషనల్ అయ్యాడు శివాజీ. కొడుకును హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత అర్జున్ అంబటి భార్య లోపలికి వచ్చింది. నిండు గర్భిణికి అయిన ఆమెకు ఇంటి సభ్యులతో సీమంతం చేయించాడు. భార్యకు సీమంతం కావడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు అర్జున్. ఇక ఆ తర్వాత అశ్విని తల్లి హౌస్ లోకి అడుగుపెట్టి కూతురిని చూసి తల్లడిల్లిపోయింది. నా బంగారు తల్లీ అంటూ కూతురుని పట్టుకుని ఏడ్చేసింది. ముగ్గురు తమవారికి మంచి సలహాలు ఇచ్చి హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో మిగతా ఇంటి సభ్యులు అడుగుపెట్టనున్నారు. మొదట డాక్టర్ బాబు గౌతమ్ తల్లి ఇంట్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశాడు బిగ్‌బాస్ .
తాజాగా విడుదలైన ప్రోమోలో.. కన్నయ్యా.. కన్నయ్యా అంటూ పిలుపు వినిపించగా.. గౌతమ్ అటు ఇటు చిన్నపిల్లాడిలా పరిగెత్తాడు. పంచె వచ్చిందా అనే డైలాగ్ రావడంతో ఆ పంచె నాకోసమే వచ్చిందా అంటూ పరిగెత్తుకెళ్లి డ్రెస్ మార్చుకుంటాడు. ఇక ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన తన తల్లిని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత కొడుకు చెవిని గిల్లింది గౌతమ్ మదర్. ఇంటి సభ్యులందరిని పలకరిస్తూ..మా అబ్బాయి ఫాలోయింగ్ పెరిగిపోయింది. అమ్మాయిలు తెగ ఫాలో అవుతున్నారు. హ్యాండ్సమ్ గా, క్యూట్ గా ఉన్నాడు.. బాగున్నాడు అని చెప్తున్నారని అనడంతో ఇంటి సభ్యులు టీజ్ చేశారు.
ఇక ఆ తర్వాత ఇద్దరు పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. నువ్వు చేస్తుంది చాలా కరెక్ట్. చాలా మంచిగా ఉంది. ఈ అమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని గౌతమ్ ను ఆశీర్వదించింది. అనంతరం ఇంటి సభ్యులకు అన్నం ముద్దలు తినిపించారు. గౌతమ్ మధర్ ను చూసి యావర్ కన్నీళ్లు పెట్టుకోగా.. యావర్ ను హగ్ చేసుకుని నువ్వు కూడా నా కొడుకులాంటి వాడివే. బయటకు వచ్చాక మా ఇంటికి రా.. ఏడవకు అంటూ ఓదార్చడంతో ప్రోమో ముగిసింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎవరెవరి ఇంటి సభ్యులు రాబోతున్నారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.