ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్స్‌లో.. కెప్టెన్సీ పొందడానికి చాలా టాస్కులు జరిగేవి. కెప్టెన్సీ కంటెండర్స్‌గా… తమను తాము నిరూపించుకున్న వాళ్లే కెప్టెన్సీ ఫైనల్ టాస్క్‌లో పాల్గొనాల్సి వచ్చేది. ఆ తరువాత భీకరంగా జరిగిన ఓటింగ్ లోనో.. లేక ఫైనల్‌గా జరిగే ఏదైనా టాస్క్ ద్వారానో … బిగ్ బాస్ నయా కెప్టెన్ ఎన్నిక జరిగేది. కానీ తాజా ఎపిసోడ్ లో మాత్రం.. కాస్త భిన్నంగా.. జరిగింది. అసలు ఏమాత్రం సీరియస్ లేకుండానే.. బిగ్ బాస్.. ఈ వారం కెప్టెన్ ఎవరో తేల్చేయడం.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
అంతకు ముందు ఎపిసోడ్‌లో.. ‘హో బేబీ’ టాస్క్‌తో హౌస్‌లోని సభ్యుల మధ్య ఓ టాస్క్ పెట్టిన బిగ్ బాస్.. ఆ టాస్క్‌లో ఫైనల్‌గా మిగిలిన శివాజీ, అర్జున్.. ఇద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశం పొందుతారని అనౌన్స్ చేస్తారు. అయితే ఆ అనౌన్స్ మెంట్ తర్వాత.. ఓటింగ్ ప్రక్రియ ఉంటుందని గెస్ చేసిన ఇద్దరూ… తమకు ఓటింగ్ వేయాలంటూ.. కంటెస్టెంట్స్ ను అడగకుండా కూర్చున్నారు. అయితే వీరిద్దరిలో తనే కెప్టెన్ అవుతాననే కాన్ఫిడెంట్ లో శివాజీ ఉన్నారు. అర్జున్ కూడా… శివాజే కెప్టెన్ అవుతాడనే బలంగా నమ్మాడు. దీంతో ఇద్దరూ ఏమాత్రం కష్టపడకుండా… తమకు ఓటు వేయాలని హౌస్‌లోని సభ్యులను రెక్వెస్ట్ చేయకుండా మిన్నకున్నారు. చిల్ అవుతూ.. ఇవ్వాళ్టి ఎపిసోడ్ కోసం.. కింగ్ నాగ్ పెట్టే వాతల కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు.
కానీ వీకెండ్ ఎపిసోడో స్టార్ చేసిన నాగ్ మాత్రం.. ఎవరికీ వాతలు పెట్టకుండా.. సింపుల్ గానే షోను ఫినిష్ చేశారు. వాతలు పెట్టి కూడా వేస్ట్ అనుకున్నారో.. లేక .. దివాళీ పండగ పూట వద్దనుకున్నారో తెలీదు కానీ.. అందరితో చాలా సింపుల్ అండ్ ఫన్ గానే మాట్లాడారు.
షో బిగినింగ్ లోనే.. శోభ కెప్టెన్సీ గురించి హౌస్‌లో ఉన్న అందర్నీ వాకబు చేసిన కింగ్ నాగార్జున.. కెప్టెన్‌గా శోభ క్యాలిఫైడ్ అని తేలుస్తారు. ఆ తరువాత ఒక్కో కంటెస్టెంట్ను సీక్రెట్ గా కన్ఫెషన్ రూంలోకి పిలిచి.. అర్జున్ అండ్ శివాజీ ఇద్దరిలో ఎవరు క్యాప్టెన్ కావాలో.. మీ ఓటు ఎవరికో చెప్పాలంటారు. ఇదంతా.. సీక్రెట్‌గా జరుగుతుందని.. హౌస్‌లోని సభ్యులెవరికీ.. కన్ఫెషన్ రూంలో మీరు మాట్లాడేది తెలియని చెబుతారు నాగ్.
దీంతో హౌస్‌లోని సభ్యులందరూ అందరూ ఊహించినట్టే శివాజీ కే ఓటు వేస్తారు. గ్రూపులనే సరిహద్దులు లేకుండా.. అప్పటి వరకు ఉన్న గొడవలను పట్టించుకోకుండా.. యునానిమస్‌గా శివాజీనే ఎన్నుకుంటారు. పెద్దవారు కదాని ఒకరు.. సీనియర్ అని మరొకరు.. శివాజీ కెప్టెన్సీ చూడాలని ఇంకొకరు.. చాలా కష్టపడి మరీ ఆడారని మరొకరు… ఇన్ని వారాలు హౌస్‌లో కొనసాగారు కదాని ఇంకొకరు.. ఇలా పోటా పోటీగా .. శివాజీనే కెప్టెన్ చేయాలని… కింగ్ నాగ్ తో చెబుతారు. అందుకోసం అర్జున్ పేరుతో ఉన్న కిరీటంలోని.. పచ్చల రాయిని.. తీసేస్తారు.
ఇక అర్జున్ ఈ కెప్టెన్సీ ఓటింగ్‌లో యునానిమస్‌గా… రిజెక్టె్ అవుతాడు. ఆల్రెడీ అర్జున్ కెప్టెన్ అయ్యాడనే ఒకే ఒక కారణంతో… శివాజీ వైపు ఉన్న వారి మనస్తత్వంతో… ఈ ఓటింగ్‌లో ఓడిపోతాడు. తన పేరుతో ఉన్న కిరీటంలో పచ్చల రాయిని.. కోల్పోతాడు. ఫలితంగా… పచ్చల స్టోన్స్ తో శివాజీ కిరీటం మెరిసిపోవడంతో,.. తనే కెప్టెన్ అవుతాడు. ఇక ఈ ఎపిపోడ్ చూసిన జనాలు.. అంతకు ముందు కెప్టెన్సీ టాస్క చూసిన ఇదే జనాలు.. శివాజీని కెప్టెన్ గా చేసే దానికి .. ఇంతోటి ఎపిసోడ్ అవసరమా అనే ఫీలింగ్ లోకి వెళతారు. అప్పుడెప్పుడో… సందీప్‌ను బొంగులో డ్యాన్సర్.. బొంగులో డ్యాన్స్ మాస్టర్ అన్న కామెంట్స్‌ను గుర్తు తెచ్చుకుని మరీ.. బొంగులో కెప్టెన్సీ టాస్క్ అని కామెంట్ చేస్తారు. ఇంతోటి దానికి టాస్కులు ఎందుకో.. శివాజీనే నేరుగా కెప్టెన్ చేసేయోచ్చుకదాని… బిగ్ బాస్‌ను నేరుగా విమర్శిస్తారు.
– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..