Bigg Boss 7 Telugu: ఆడేవాడిని తప్పిస్తారా ?.. ఇంతకంటే అన్యాయం ఉంటుందా ?..
రెడ్ బ్యాచ్, ఎల్లో బ్యాచ్ లుగా డివైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. రెడ్ బ్యాచ్‌లో యావర్, గౌతమ్, తేజ, రతిక, భోలే షావలి, శోభా ఉండగా.. ఎల్లో బ్యాచ్ లో ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, అమర్ దీప్, అశ్విని ఉన్నారు. మొదటి ఛాలెంజ్ లో భాగంగా.. జంపింగ్ జంపాంగ్ టాస్కులో అపోనెంట్ టీంపై గెలిచేందుకు వీలైనన్ని ఎక్కువ బెలూన్స్ లో గాలి ఊది.. టైర్లలో సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్కుకు ప్రియాంక సంచాలక్. ఇక ఈ టాస్కులో తేజ, ప్రశాంత్ బెలూన్స్ లో గాలి ఫిల్ చేయగా..
బిగ్‌బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్ కోసం పోటీ జరుగుతుంది. ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ ప్రోమోలో ఫన్నీ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమ్మాయిలను కూర్చొబెట్టి వారికి అబ్బాయిలు సేవలు చేయాల్సి ఉంటుంది. వారిని మహరాణుల్లా చూసుకోవాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ఇక ఈ టాస్కులో తేజ, శోభా జీవించేశారు. శోభాను ఎత్తుకోవడం.. పళ్లు తోమించడం.. బాబోయ్ అనేట్టుగా బాగానే ఎంటర్టైనర్ చేశారు. ఇక ఇప్పుడు బిగ్‌బాస్ సెకండ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. తాజాగా విడుదలైన ప్రోమోలో.. కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీంలుగా విడగొట్టాడు. రెడ్ బ్యాచ్, ఎల్లో బ్యాచ్ లుగా డివైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. రెడ్ బ్యాచ్‌లో యావర్, గౌతమ్, తేజ, రతిక, భోలే షావలి, శోభా ఉండగా.. ఎల్లో బ్యాచ్ లో ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, అమర్ దీప్, అశ్విని ఉన్నారు. మొదటి ఛాలెంజ్ లో భాగంగా.. జంపింగ్ జంపాంగ్ టాస్కులో అపోనెంట్ టీంపై గెలిచేందుకు వీలైనన్ని ఎక్కువ బెలూన్స్ లో గాలి ఊది.. టైర్లలో సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్కుకు ప్రియాంక సంచాలక్. ఇక ఈ టాస్కులో తేజ, ప్రశాంత్ బెలూన్స్ లో గాలి ఫిల్ చేయగా.. యావర్, అర్జున్ బెలూన్స్ టైర్లలో ఫిట్ చేశారు.
ఈ టాస్క్ అనంతరం బిగ్‌బాస్ పోస్ట్ పంపించి అసలు ట్విస్ట్ ఇచ్చారు. బిగ్‌బాస్ పంపిన ఉత్తరంలో.. “మొదటి పవర్ బాక్స్‌లో మీకు లభిస్తున్న పవర్.. మీ అపోజిట్ టీం నుంచి ఒకరిని గేమ్ నుంచి తీసేయాలి. వాళ్లు ఎప్పుడూ డెడ్ బోర్డ్ వేసుకుని ఉండాల్సి ఉంటుంది” అని రాసి ఉంది. అయితే ముందుగా పవర్ బాక్స్ రెజ్ బ్యాచ్ తీసుకోవడంతో ఎల్లో బ్యాచ్ నుంచి పల్లవి ప్రశాంత్‌ను గేమ్ నుంచి తప్పించారు. దీంతో ప్రశాంత్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ ఎమోషనల్ కావడంతో అమర్ దీప్, శోభా అతడిని మోటివేట్ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత డెడ్ బోర్డ్ ప్రశాంత్ మెడలో వేయడంతో.. ఆ బోర్డ్ చూస్తూ మరింత కసిగా ఆడాలి అనుకో అంటూ మరింత మోటివేట్ చేస్తూ కనిపించాడు శివాజీ. పుష్ప డెడ్ అనుకున్నారు.. పార్ట్ 2 వస్తుంది అంటూ ప్రశాంత్ ను ఉత్సాహపరిచారు హౌస్మేట్స్.
View this post on Instagram
మొదటి వారం నుంచి అన్ని గేమ్స్‌లో వందశాతం ఎఫర్ట్స్ పెడుతూ.. ఫస్ట్ కెప్టెన్ కావడమే కాకుండా.. శారీరకంగా తనకంటే బలవంతులైన హౌస్మేట్స్ తో తలపడుతున్న ప్రశాంత్‌ను గేమ్ నుంచి తప్పించడం నిజంగానే అన్యాయం అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.