Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్స్ ప్రేమకథలు.. రైతుబిడ్డ, డాక్టర్ బాబు బ్రేకప్ లవ్ స్టోరీస్.. శోభా లాక్‏డౌన్ లవ్..

|

Dec 02, 2023 | 7:23 AM

గార్డెన్ ఏరియాలో టీ, బిస్కెట్స్ పెట్టి ఒక్కొక్కరి ప్రేమకథలు చెప్పాలని అన్నాడు. దీంతో బిగ్‌బాస్ పంపిన టీ తాగుతూ తమ లవ్ స్టోరీస్ బయటపెట్టారు. ముందుగా శివాజీ ప్రేమకథ అడిగారు అంతా. మాస్టర్ సినిమా అయిపోయాక.. తెలిసినవాళ్ల ఇంట్లో జరిగిన ఫంక్షన్లో తనను కలిశానని..ఆ తర్వాత ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని.. ప్రతిరోజు చిక్కడపల్లిలో తను ట్యూషన్ కు వెళ్లేటప్పుడు కలిసేవాడనని.. తన డిగ్రీ ఫైనల్ ఇయార్ లో పెళ్లి చేసుకున్నామంటూ షర్ట్ అండ్ క్యూట్ గా తమ ప్రేమకథను ముగించేశాడు శివాజీ.

Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్స్ ప్రేమకథలు.. రైతుబిడ్డ, డాక్టర్ బాబు బ్రేకప్ లవ్ స్టోరీస్.. శోభా లాక్‏డౌన్ లవ్..
Bigg Boss 7 Telugu Highligh
Follow us on

బిగ్‌బాస్ సీజన్ 7 ఇప్పుడు చివరి దశకు వచ్చేస్తోంది. మరో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే ఉండనుంది. గత సీజన్ల కంటే ఉల్టా పుల్టా అంటూ వచ్చిన ఈ సీజన్ సూపర్ హిట్ అయ్యిందనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు కంటెస్టెంట్లకు వరుస టాస్కులు పెడుతూ ఉక్కిరిబిక్కిరి చేసిన బిగ్‌బాస్.. నిన్నటి ఎపిసోడ్ లో పనిష్మేంట్ అంటూ హౌస్మేట్స్ అందరిని గంట నిద్రపోవాలని ఆదేశించాడు. ఇక వాళ్లంతా నిద్రలేచేసరికి గార్డెన్ ఏరియాలో టీ, బిస్కెట్స్ పెట్టి ఒక్కొక్కరి ప్రేమకథలు చెప్పాలని అన్నాడు. దీంతో బిగ్‌బాస్ పంపిన టీ తాగుతూ తమ లవ్ స్టోరీస్ బయటపెట్టారు. ముందుగా శివాజీ ప్రేమకథ అడిగారు అంతా. మాస్టర్ సినిమా అయిపోయాక.. తెలిసినవాళ్ల ఇంట్లో జరిగిన ఫంక్షన్లో తనను కలిశానని..ఆ తర్వాత ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని.. ప్రతిరోజు చిక్కడపల్లిలో తను ట్యూషన్ కు వెళ్లేటప్పుడు కలిసేవాడనని.. తన డిగ్రీ ఫైనల్ ఇయార్ లో పెళ్లి చేసుకున్నామంటూ షర్ట్ అండ్ క్యూట్ గా తమ ప్రేమకథను ముగించేశాడు శివాజీ.

ఇక కార్తీక దీపం షూటింగ్‏లోనే తమ ప్రేమ మొదలైందని.. మొదట తనే పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ లో మెసేజ్, కాల్స్ ఎక్కువగా చేసుకునే వాళ్లమని..అబ్బాయి మంచివాడని అనిపించింది తనే ప్రపోజ్ చేశానని.. మూడున్నర ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పుకొచ్చింది. నువ్వు లేకపోతే శోభా లేదు అంటూ ఎమోషనల్ అయ్యింది.

ఇక డాక్టర్ బాబు తన బ్రేకప్ స్టోరీ బయటపెట్టాడు. 2016లో ఏంబీబీఎస్ చేస్తున్నప్పుడు ఒకమ్మాయి పరిచయమైందని.. తర్వాత ఫోన్ లో రోజూ మాట్లాడుకున్నామని.. సినిమాల్లోకి వెళ్తానని చెబుతుంటే సెటిల్ అవుతానా లేదా అని భయపడేది. కానీ వాళ్ల నాన్న నన్ను నమ్మలేదు. చివరకు నా గురించి ఒక స్టాండ్ తీసుకోలేకపోయింది. అలా బ్రేకప్ జరిగింది అంటూ.. నేను సింగిల్ అమ్మాయిలు అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్.

ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లినప్పుడు పక్క టేబుల్ మీద ఉన్న అమ్మాయిని చూసి అట్రాక్ట్ అయ్యి వెళ్లి నంబర్ అడిగానని.. ఆ తర్వాత నాలుగు రోజులకు ఆ ఫోన్ నంబర్ ఆ అమ్మాయిది కాదని తెలిసిందని అని అన్నాడు అర్జున్. ఆ తర్వాత తనకు ఇష్టమైన అమ్మాయి నంబర్ తీసుకుని ప్రపోజ్ చేశానని.. రెండేళ్ల తర్వాత తమ పెళ్లి జరిగిందని.. నా కన్నా తనే ఎక్కువ అడ్జస్ట్ అవుతుందని చెప్పాడు అర్జున్.

ఇక రైతుబిడ్డ లవ్ స్టోరీ అడిగాడు బిగ్‌బాస్. మొదట మొహమాటపడిన ప్రశాంత్.. తర్వాత తన స్టోరీ బయటపెట్టాడు. పొలం దగ్గరికి వెళ్తుంటే ఒకమ్మాయి హాయ్ చెప్పిందని.. ఆ తర్వాత నంబర్ తీసుకొని హాయ్ అంటూ మెసేజ్ చేసిందని.. ఆ అమ్మాయి తనకు మరదలు వరుస అవుతుందని అని అన్నాడు. తర్వాత తన ఫ్రెండ్ ను చూపించింది.. మెల్లగా మాట్లాడటం తగ్గించింది. రోజు 100 మెసేజ్ లు చేస్తున్నా రిప్లై ఇవ్వలేదు. పొలం పని విడిచిపెట్టి వేరే పని చేసుకుంటే నాతో వస్తానంది. నేను అదే పని చేస్తా అని చెప్పాను. ఆమె వాడితో వెళ్లిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్.

ఇక అమర్ జీవితంలో ప్రేమకథల గురించి బయటపెట్టాడు. అనంతపురంలో మొదలైన ప్రేమకథ మనస్పర్థలతో దూరమైందని.. ఆ తర్వాత తన భార్య తేజుతో పరిచయం.. ప్రేమగా మారడం గురించి చెప్పుకొచ్చాడు. లైఫ్ లో కిందా మీద అన్నీ తిన్న తర్వాత ఒక సీరియల్ ఆఫర్ వచ్చిందని.. సేమ్ ప్రొడక్షన్ హౌస్, తేజును మొదటి సారి చూశానని అని అన్నాడు. సెట్ లో డైరెక్టర్ గా వెళ్లి మాట్లాడి నంబర్ తీసుకున్నానని.. జీవితంలో తనకు చాలా హెల్ప్ చేసిందని.. ఆ తర్వాత నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశానని అన్నాడు. తర్వాత పెళ్లి చేసుకున్నామని.. తన గత జీవితాన్ని అర్థం చేసుకుని అన్నింటినీ ఓపికగా భరించి నాతో ఉంది. నాకు అది చాలు అంటూ చెప్పుకొచ్చాడు అమర్.