ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 10 కంటెస్టెంట్స్ మధ్య పోటీ జరుగుతుంది. సోమవారం, మంగళవారం నామినేషన్స్‌తో హీటెక్కిన సంగతి తెలిసిందే. 11వ వారం యావర్, అమర్, ప్రియాంక, శోభా శెట్టి, రతిక, గౌతమ్, అర్జున్, అశ్విని నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక శివాజీ కెప్టెన్ కావడంతో అతడిని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదని ముందే అనౌన్స్ చేశారు బిగ్‌బాస్ . ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ను కేవలం అర్జున్ మాత్రమే నామినేట్ చేయడంతో అతడు కూడా ఈవారం నామినేషన్స్ లోకి రాలేదు. దీంతో మొత్తం ఈవారం ఎనిమిది మంది ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్మేట్స్ కు మరో కొత్త టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్ . కంటెస్టెంట్స్ మధ్య ర్యాంకుల పోటీ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో ఉన్న మొత్తం 10 మంది కంటెస్టెంట్స్.. ఎవరెవరు ఏ ఏ స్థానానికి అర్హులో చెప్పాలని..ఆయా స్థానాల్లో ఎందుకు అర్హులనేది చెప్పాల్సి ఉంటుందని ఆదేశించాడు. దీంతో మరోసారి హౌస్మేట్స్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఉదయం రిలీజ్ అయిన మొదటి ప్రోమోలో రతిక, అర్జున్ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. నేను 5వ స్థానంలో ఉంటాను అంటూ రతిపాప అతి చేస్తే.. అంతలేదు నీకు 10 ప్లేస్ కరెక్ట్ అంటూ కౌంటరిచ్చాడు.
ఇక తాజాగా విడుదలైన సెకండ్ ప్రోమోలో.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ముందుగా ప్రశాంత్‌కు నెంబర్ వన్ స్థానం అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు శివాజీ. దీంతో ప్రశాంత్ భావోద్వేగానికి గురయ్యాడు. నా జీవితంలో ఎవ్వరు చేయలే. అన్న చేసిండు. పల్లవి ప్రశాంత్ సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ అంటూ గుండెలపై బాదుకున్నాడు. ఆ తర్వాత రతికా ప్రశాంత్‌తో మాట్లాడుతూ. ఫస్ట్ నాలుగు వారాలు నీ గేమ్ ఏమీ లేదు. నీకు ఒకరు హెల్ప్ చేస్తున్నది కనిపియ్యట్లే.. నీకు సొంతంగా ఆడుతున్నావో.. గ్రూపుగా ఆడుతున్నావో కనిపియట్లేదు అనడంతో.. ప్రశాంత్ రివర్స్ అయ్యాడు.
అక్కా.. నువ్వు మా అమ్మ, బాపును తిట్టినవ్.. గడ్డం గీకెస్తా అన్నావ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత అశ్విని.. ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాద అనడంతో.. నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి.. రెస్పెక్ట్ ఇవ్వడం తెలుసు. నువ్వు క్లాస్ తీసుకోకు అంటూ సీరియస్ అయ్యాడు యావర్. ఇక ఆ తర్వాత మొదటి స్థానంలో శివాజీ, రెండవ స్థానంలో యావర్, మూడవ స్థానంలో ప్రశాంత్, నాల్గవ స్థానంలో ప్రియాంక, ఐదవ స్థానంలో శోభా శెట్టి, ఆరవ స్థానంలో అమర్ దీప్, ఏడవ స్థానంలో గౌతమ్ కృష్ణ, ఎనిమిదిలో అర్జున్, తొమ్మిదిలో అశ్విని, పదవ స్థానంలో రతిక నిల్చున్నారు.
అయితే ముందు నుంచి ఉల్టా పుల్టా అంటున్న బిగ్‌బాస్.. ఈసారి కంటెస్టెంట్స్ కు ఊహించని షాకిచ్చాడు. ఈ సీజన్ ఉల్టా పుల్టా.. అందుకే ఆటలో వీకెస్ట్ అనిపించిన వారికే.. అంటే చివరి ఐదు స్థానాల్లో నిలిచిన వారికే ఎవిక్షన్ పాస్ పొందే అవకాశముందని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్ . దీంతో ఎవిక్షన్ పాస్ కోసం ఐదుగురు కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చాడు. వీరిలో చివరగా అర్జున్, యావర్ నిలవగా. వీరిద్దరికి మరో టాస్క్ ఇవ్వడంతో ప్రోమో ముగిసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.