బిగ్బాస్ సీజన్ 7 ప్రస్తుతం 12వ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కొనసాగుతుంది. ఉల్టా పుల్టా అంటూ తీసుకొచ్చిన ఈ సీజన్ మొదటి వారం నుంచి మంచి టీఆర్పీ రేటింగ్ అందుకుంటుంది. అన్ని సీజన్లకు మించి కాస్త డిఫరెంట్గా సాగడం.. ఈసారి కంటెస్టెంట్స్ సైతం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడం.. ట్విస్టులతో ఈ సీజన్ హిట్ అయ్యింది. ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకు దగ్గర పడుతోంది. అయితే బిగ్బాస్ లెక్కలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టమే. ఆట చివరి దశకు వచ్చేటప్పకీ మాత్రమే టైటిల్ విజేత ఎవరనే విషయం ఓ అంచనాకు వస్తుంది. గత సీజన్లలో ఫ్యామిలీ వీక్ తర్వాత విన్నర్, టాప్ 5 ఎవరనేది క్లారీటీ వస్తుండేది. కానీ ఈసారి 11వ వారంలోనే ఫ్యామిలీ వీక్ జరగడంతో తమ ఆట తీరును మార్చుకున్నారు కంటెస్టెంట్స్. ఈ సీజన్ లో చాలా మంది నెంబర్ 1 శివాజీ, నెంబర్ 2 ప్రశాంత్, మూడవ స్థానంలో అమర్ దీప్ ఇలా హింట్స్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు బిగ్బాస్ టాప్ కంటెస్టెంట్స్, విన్నర్ లెక్కలు పూర్తిగా తారుమారు అయిపోయాయి. మొన్నటి వరకు ఫుల్ నెగిటివిటీ ఉన్న అమర్ దీప్ ఇప్పుడు పాజిటివ్ ఫుటేజ్ వస్తుంది. దీంతో ఓటింగ్ లో దూసుకెళ్తున్నాడు. ఇక టాప్ 3లో ఉన్న శివాజీ, ప్రశాంత్, యావర్ ఓటింగ్ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది.
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న లెక్కల ప్రకారం మొన్నటి వరకు టాప్ 1లో ఉన్న శివాజీ ఇప్పుడు మూడవ స్థానానికి చేరిపోయాడు. ఇక ఇన్నాళ్లు నెగిటివిటీని మూటగట్టుకున్న అమర్ దీప్ ఉన్నట్లుండి నెంబర్ 1 ప్లేస్ లో టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ ప్రియాంక మినహా మిగతా ఇంటిసభ్యులు మొత్తం ఉన్నారు. అయితే ఈ రెండు వారాలుగా అమర్ దీప్ కు పాజిటివ్ ఫుటేజ్ వస్తోంది. అంతేకాకుండా ఫ్యామిలీ వీక్ తర్వాత అమర్ తన ఆట తీరును పూర్తిగా మార్చేశాడు. దీంతో ఇప్పుడు టైటిల్ రేసులో ముందున్నాడు.
తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే.. అమర్ దీప్.. 31.1% శాతం ఓటింగ్ తో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నాడు.. ఇక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ 23.97 %తో రెండవ స్థానంలో ఉండగా.. శివాజీకి ఓటింగ్ సగానికి పైగా పడిపోయింది. కేవలం 15.19% ఓటింగ్ తో మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక డాక్టర్ బాబుకు శుక్రవారం ఉదయం వరకు 10.99% ఓట్లు రాగా నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత యావర్ 10.95% స్వల్ప తేడాతో ఐదవ స్థానంలో ఉండగా.. రతికకు 3.39 % ఓటింగ్ తో ఆరవ స్థానంలో ఉంది. తర్వాత అర్జున్ కు 3.26% ఓటింగ్ తో ఏడవ స్థానంలో, చివరగా అశ్విని 1.11% ఓటింగ్ తో చివరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు వారాల ఆట తీరుతో టైటిల్ రేసులో ముందున్నాడు అమర్ దీప్.
అమర్ దీప్
ప్రశాంత్
శివాజీ
గౌతమ్
యావర్
రతిక
అర్జున్
అశ్విని
అయితే ప్రశాంత్, శివాజీ, యావర్ ముగ్గురు నామినేషన్స్ లో ఉండడంతో వీరికి తక్కువగా ఓటింగ్ వస్తుంది. ఇక సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభా శెట్టి నామినేషన్స్ లో లేకపోవడంతో ఒక్కసారిగా ఓటింగ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో అశ్విని, అర్జున్ ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ వారం రతిక, అశ్విని ఎలిమినేట్ కానున్నారట. అయితే దీనిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.