Bigg Boss 7 Telugu: అమర్ ధైర్యమే మానస్.. ఒక్క మాటతో బూస్ట్ ఇచ్చేశాడు.. శివాజీకి కొడుకు సలహా..

|

Nov 12, 2023 | 1:51 PM

ముందుగా హ్యాపీ దీవాళీ అంటూ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత యావర్ కోసం అతడి సోదరుడితో పాటు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ వచ్చారు. యావర్ కు తెలుగు నేర్పించలేదా అని ఇమ్మాన్యుయేల్ ను నాగార్జున అడగ్గా.. వాడికి తెలుగు రాదు.. నాకు హిందీ, ఇంగ్లీష్ రెండూ రావు. కేవలం వీడియో కాల్స్ చేసి సైగలు చేసుకుంటామంటూ చెప్పుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. తర్వాత అమర్ కోసం అతడి తల్లితోపాటు మానస్ ఎంట్రీ ఇచ్చారు. నాన్న ఎలా ఉన్నాడని అమర్ అడగ్గా.. నువ్వు కప్పు గెలిచేవరకు నాన్న

Bigg Boss 7 Telugu: అమర్ ధైర్యమే మానస్.. ఒక్క మాటతో బూస్ట్ ఇచ్చేశాడు.. శివాజీకి కొడుకు సలహా..
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్‏బాస్ హౌస్‏లో పదవవారం ఎలిమినేషన్ ఎపిసోడ్ వచ్చేసింది. తాజాగా విడుదలైన ప్రోమోలో దీపావళి సెలబ్రెషన్స్ స్టార్ట్ అయ్యింది. కాజల్, శ్రీలీల, హైపర్ ఆది గెస్టులుగా సందడి చేయగా.. ఒక్కో హౌస్మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు బిగ్‏బాస్ స్టేజ్ పై అలరించారు. ముఖ్యంగా అమర్ స్నేహితుడు మానస్.. తన స్నేహితుడికి మరింత ధైర్యమిచ్చారు. ఇక శివాజీకి తనయుడు రిక్కీ తండ్రికి మంచి సలహాలు ఇచ్చాడు. ముందుగా హ్యాపీ దీవాళీ అంటూ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత యావర్ కోసం అతడి సోదరుడితో పాటు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ వచ్చారు. యావర్ కు తెలుగు నేర్పించలేదా అని ఇమ్మాన్యుయేల్ ను నాగార్జున అడగ్గా.. వాడికి తెలుగు రాదు.. నాకు హిందీ, ఇంగ్లీష్ రెండూ రావు. కేవలం వీడియో కాల్స్ చేసి సైగలు చేసుకుంటామంటూ చెప్పుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. తర్వాత అమర్ కోసం అతడి తల్లితోపాటు మానస్ ఎంట్రీ ఇచ్చారు. నాన్న ఎలా ఉన్నాడని అమర్ అడగ్గా.. నువ్వు కప్పు గెలిచేవరకు నాన్న హైదరాబాద్ రాను అన్నాడని చెప్పేసింది అమర్ మదర్. మానస్ మాట్లాడుతూ.. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. మీసం తిప్పరా అంటూ అమర్ కు బూస్ట్ ఇచ్చాడు మానస్.

ఇక డైరెక్టర్ బుచ్చిబాబు అర్జున్ కు స్టేజ్ పైనే బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టులో అర్జున్ సూపర్ క్యారెక్టర్ చేయబోతున్నాడని చెప్పడంతో అర్జున్ తెగ సంతోషపడిపోయాడు. ఇక సోహైల్ మాట్లాడుతూ.. ప్రతి సీజన్ లో నేను బిగ్‏బాస్ స్టేజీ పైకి వస్తున్నాను. ఎందుకంటే నేను ఎలిమినేట్ కాలేదని సోహైల్ అనడంతో.. సూట్ కేస్ తీసుకెళ్లిపోయినోడికి ఏం ఎలిమినేట్ అవుతావులే అంటూ పంచ్ ఇచ్చారు నాగ్. ఇక మానస్ కు అడ్వాన్స్ మ్యారీడ్ లైఫ్ అంటూ అర్జు్న్ విష్ చేయడంతో.. అడ్వాన్స్ ఏంటీ అని నాగ్ అడిగాడు. మ్యారేజ్ అయిన తర్వాత హ్యాప్పీ ఉండదని అర్జున్ చెప్పడంతో సురేఖ గుర్తుపెట్టుకో అంటూ అర్జున్ సతీమణికి చెప్పేశాడు.

ఇక తర్వాత శివాజీ చిన్నకొడుకుతోపాటు అతడి భార్య వేదికపైకి వచ్చారు. శివాజీ సతీమణి ఒక రియాల్టీ షోకు రావడం ఇదే తొలిసారి. కనీసం ఫోన్ కంటాక్ట్ కూడా లేకుండా ఎప్పుడు ఉండలేమని శివాజీ వైఫ్ చెప్పగా.. నా భార్య ఎవరికి తెలీదు.. ఫస్ట్ టైమ్ వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యాడు శివాజీ. ఇక ఆ తర్వాత శివాజీ చిన్నకొడుకు మాట్లాడుతూ.. భోలే అన్నా అని పిలవడంతో.. భోలే అంకుల్ అంటూ కౌంటరిచ్చాడు శివాజీ. అంకుల్ కాదు.. భోలే అన్నా హీరో అని అన్నాడు. తర్వాత మా అమ్మను ఆంటీ అని పిలిచింది.. శోభా అంటీ ఎక్కడుంది అంటూ మరోసారి పంచ్ ఇచ్చాడు. నువ్వు ఎంత పెద్ద హీరోవో నాకు తెలీదు.. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక శివన్న ఉన్నాడు. మరోసారి నీ నోటి వెంట బయటకు వచ్చేస్తాను అనే మాట రావొద్దు అంటూ కొడుకు సలహా ఇవ్వడంతో శివాజీ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ను చూసి ప్రియాంక ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత ఒక్కొక్కరు టాప్ 5లో ఉండే హౌస్మేట్స్ ఎవరో చెప్పడంతో ప్రోమో ముగిసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.