Bigg Boss 5 Telugu: నేను కిచన్ మొహమే ఎప్పుడు చూడలేదన్న కాజల్.. శ్రీ రామ్ ఏంచేశాడంటే..

|

Sep 12, 2021 | 4:56 PM

బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తుంది. గత సీజన్స్‌తో పోల్చుకుంటే ఈ సారి గేమ్ షో మరింత రసవత్తరంగా సాగుతుంది.

Bigg Boss 5 Telugu: నేను కిచన్ మొహమే ఎప్పుడు చూడలేదన్న కాజల్.. శ్రీ రామ్ ఏంచేశాడంటే..
Bigg Boss
Follow us on

Bigg Boss 5 Telugu: : బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తుంది. గత సీజన్స్‌తో పోల్చుకుంటే ఈ సారి గేమ్ షో మరింత రసవత్తరంగా సాగుతుంది. కంటెస్టెంట్స్ మధ్య ఏడుపులు, గొడవలు, అల్లర్లు అన్నీ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఐదో రోజు బిగ్ బాస్ హౌస్‌లో హడావిడి మాములుగా లేదు. ఈ సారి కాజల్‌తో వాదనకు దిగారు ప్రియా , శ్రీరామ్. వంట చేయమన్నందుకు రచ్చ రచ్చ చేసింది కాజల్. నాకు వంట రాదు. నేను కిచన్ మొహం కూడా చూడలేదు అంటూ వాదించింది కాజల్. దాంతో హౌస్ లో మరో గందరగోళం ఏర్పడింది.

‘నేను ఎప్పుడు వంట చేయలేదు.. కిచెన్ మొహమే చూడలేదు’ అని కాజల్ అనడంతో ఆమె పై వాదానికి దిగారు ప్రియా, శ్రీ రామ్. వెంటనే శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘తెలుగు వాళ్లలో ప్రతి ఒక్క ఆడవాళ్లు సాధారణంగా వంట చేస్తారు.. మీరు అలా అంటే ఎలా? నాకు కూడా వంట రాదు.. అయినా నేను ఇక్కడ సామాన్లు కడుగుతున్నాను’ అంటూ శ్రీరామ్ అంటూ అరిచేశాడు..ఇంతలో  అక్కడే ఉన్న ప్రియ అందుకొని .. ‘కనీసం సామాన్లు కడుగుతావా..? వంట రాదు అంటే కనీసం సామాన్లు కడుగుపోనీ..? అని అంది. దాంతో మరోసారి కాజల్  ‘ఐ డోంట్ వాంట్ కిచెన్ అంటున్నాను ప్రియాగారు’ అంటూ పొగరు చూపే ప్రయత్నం చేసింది. ఇక కెఫ్టెన్ సిరి కూడా కాజల్‌ని సమన్లు కడిగేలా ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయినా కాజల్ వెనక్కి తగ్గదు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej Accident Live Updates : సాయి ధరమ్ తేజ్‌ అవుట్ ఆఫ్ డేంజర్.. కొనసాగుతున్న చికిత్స ..

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు.. అతివేగం, ర్యాష్ డ్రైవింగే కారణం..

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్ విడుదల.. టెన్షన్ లేదన్న వైద్యులు..