బిగ్‌బాస్ 5 తెలుగు: షణ్ముఖ్ జశ్వంత్.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత సూర్య వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించాడు మిస్టర్ షన్ను. అయితే షన్ను ఇప్పుడు పాపులర్ యూట్యూబర్‌గా బుల్లితెరపై అత్యంత ఫేమస్ బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. నిన్న సాయంత్రం బిగ్‌బాస్ సీజన్ 5 ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో టెలివిజన్ షోపై సందడి షూరు అయ్యింది. ఇందులో ఈసారి.. లోబో, సన్నీ, సిరి, ప్రియాంక సింగ్, నటి ప్రియ, ఉమా దేవీ, షన్ను, ఆర్జే కాజల్, మానస్, సరయు, నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, శ్రీరామ చంద్ర, శ్వేతా వర్మ, హమీద, లహరి షరి, మోడల్ జెస్సీ కంటెస్టెంట్స్ ఇంట్లోకి వెళ్లారు. అయితే ఇందులో కొందరు తెలియని ముఖాలు.. ఎక్కువగా ఫేమస్ కానివారు కూడా ఉన్నారు. అందులో శ్వేతా వర్మ, హమీద, లహరి షరి, మోడల్ జెస్సీ వంటి వారు ఉన్నారు.
అయితే ఇందులో షణ్ముఖ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. దీప్తి సునయన స్నేహితుడిగానే.. కాకుండా.. ఫేమస్ యూట్యూబర్ గానూ షన్ను పాపులయ్యాడు. ఇక ఇటీవల షన్ను పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో షన్ను పట్టుబడినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు షన్ను. బిగ్‌బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ పాల్గొంటున్నట్లుగా గత కొద్ది రోజుల నుంచే వార్తలు వచ్చాయి. ఇక అంతా అనుకున్నట్టుగానే షన్ను బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు షన్నూకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో చూస్తుంటే.. అతను క్యారంటైన్లో ఉన్నప్పుడు చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. అందులో షణ్ముఖ్ మాట్లాడుతూ.. ఈ వీడియో మీరు చూసే సమయానికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఓ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అని. మీ సపోర్ట్, మీ ఓపిక కూడా కోరుకుంటున్నాను. నా గురించి నాకే సరిగ్గా తెలియదు.. అది తెలుసుకోవడానికే వెళ్తున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు .. చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు. అది గుర్తుపెట్టుకుని నా మీద ట్రోల్స్ కానీ ఫేక్ న్యూస్ గానీ వేయండి. నా వీడియోలు బాగా లేకపోతే కామెంట్ చేశారు.. అది చూసి నేను ఇంకా నేర్చుకున్నాను. ఎక్కువగా జడ్జ్ చేయకుండా నార్మల్‌గా చూస్తారని అనుకుంటున్నాను. నేను పెద్ద సెలెబ్రిటీని కాదు.. అస్సలు కాదు.. నాకు అంత లేదు.. ఈ జర్నీలో పార్ట్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.. బయటకు వచ్చాక అందరితో మాట్లాడాతను.. ఐ లవ్యూ ఆల్ అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.
Also Read: Bigg Boss 5 Telugu: నాగార్జునకే ఫ్యాషన్ పాఠాలు చెప్పిన మోడల్ జెస్సీ ఎవరో తెలుసా ?..