Bigg Boss Telugu 5: ఫైనల్‌కు వేళాయెరా.. బిగ్ బాస్5 విజేత ఆ ఇద్దరిలో ఒకరు అంటున్నారే..

Bigg Boss 5 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. మరి కొద్దిరోజుల్లో సీజన్ 5 ముగియనుంది. హోస్ట్ గా నాగార్జున విజయవంతంగా మూడోది కూడా పూర్తి చేశారు.

Bigg Boss Telugu 5: ఫైనల్‌కు వేళాయెరా.. బిగ్ బాస్5 విజేత ఆ ఇద్దరిలో ఒకరు అంటున్నారే..
Biggboss

Edited By: Ravi Kiran

Updated on: Dec 19, 2021 | 7:11 PM

Bigg Boss 5  Winner Runner up Prize money: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. మరి కొద్దిరోజుల్లో సీజన్ 5 ముగియనుంది. హోస్ట్ గా నాగార్జున విజయవంతంగా మూడోది కూడా పూర్తి చేశారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి 4, 5 కు నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక 19 మంచి కంటెస్టెంట్స్‌తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5లో చివరకు ఐదుగురు మిగిలారు. సిరి , షణ్ముఖ్, మానస్, సన్నీ , శ్రీరామ్ వీరిలో ఒకరు బిగ్ బాస్ విజేతగా నిలవనున్నారు. అయితే ఈ ఐదుగురిలో బిగ్ బాస్ ట్రోఫీ ఎవరు అందుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ సిరి ను అనూహ్యంగా ఎలిమినేట్ అంటూ ప్రకటించాడు. దాంతో సిరి లబోదిబోమంటూ ఏడ్చేసింది. నేను వెళ్ళాను అంటూ కాస్త అతి చేసింది. ఇక షణ్ముఖ్ అయితే నిలుచున్న చోటే కూలిపోయాడు.. కుమిలిపోయాడు.. చివరిలో తూచ్ అంటూ.. సిరి మళ్లీ హౌస్‌లో వదిలారు.

ఇదిలా ఉంటే ఇక ఫినాలే దగ్గర పడుతుండటంతో విజేత ఎవరు అన్నదాని పై చర్చ సాగుతుంది. అయితే హౌస్ లో ఉన్న వారిలో సన్నీ , శ్రీరామ్ మధ్య గట్టి పోటీ జరిగే ఛాన్స్ ఉన్నదని అర్ధమవుతుంది. ఐదుగురిలో రేపు ఇద్దరిని సున్నితంగా ఎలిమినేట్ అయ్యారు అని చెప్పి బయటకు పంపించనున్నారు. ఆతర్వాత మిగిలిన ముగ్గురిలో ఒకరి ముందు మనీ బ్యాగ్ పెట్టి ఎలిమినేట్ గేమ్ నుంచి అవుట్ అవుతాననుకున్నవారు ఆ మనీతో బయటకు వెళ్లిపోవచ్చు అని చెప్తారు.. మిగిలిన ముగ్గురిలో ఎవరో ఒకరు ఆ మనీ బ్యాగ్ ను తీసుకొని గేమ్ నుంచి అవుట్ అవుతారు. ఆతర్వాత మిగిలిన ఇద్దరిలో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. అయితే ఈ సారి చివరకు శ్రీరామ్, సన్నీ మిగులుతారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఇద్దరిలో శ్రీరామ్ గెలుస్తాడని కొంతమంది.. లేదు సన్నీ విన్ అవుతాడని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఇద్దరిలో బిగ్ బాస్ సీజన్ 5 ట్రోఫీ ఎవరికీ వరిస్తుందో చూడాలి. ఇక షణ్ముఖ్, మానస్ కూడా చివరివరకు వెళ్లే ఛాన్స్ లు ఉన్నాయి. మరి బిగ్ బాస్ సీజన్ 5 ఎలా ముగుస్తుందో చూడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. ఇక బిగ్ బాస్ సీజన్ విజేతగా నిలిచే కంటెస్టెంట్ కు 50 లక్షలు ప్రైజ్ మనీ, ట్రోఫీ, ఒక బైక్ అందించనున్నారు. అలాగే రన్నరప్ గా నిలిచే కంటెస్టెంట్ కు 25 లక్షలు అండనున్నాయని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Shyam: ప్రభాస్ సినిమా ప్రీరిలీజ్‌‌కు ముహూర్తం ఖరారు.. ఘనంగా రాధేశ్యామ్ ఈవెంట్..

Bangarraju Movie: వాసివాడి తస్సాదియ్యా.. అంటూ స్టెప్పులేస్తున్న నాగార్జున, నాగచైతన్య..

Nani: ఆ దర్శకుడితో అప్పుడు కుదరలేదు.. ఇప్పుడు వస్తే వదులుకోను.. నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్