బిగ్‌బాస్ పదవ వారం ఎమోషన్స్ మధ్య సాగుతుంది. అనారోగ్య సమస్యలతో జెస్సీని ఇంటి నుంచి బయటకు పంపుతున్నట్లుగా తెలిపాడు బిగ్‌బాస్. ఇక జెస్సీ వెళ్లిపోవాల్సి రావడంతో సిరి, షణ్ముఖ్‌లు వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే జెస్సీ వెళ్లిపోయాడు అనుకుంటే.. తిరిగి సిక్రెట్ రూంలోకి వచ్చేశాడు. నాకు హెల్త్ చెకప్ చేయించారు. నాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు.. హెల్త్ కండిషన్ ఒకే.. నేను ఇంకా గేమ్‌లోనే ఉన్నాను.. సీక్రెట్ రూంలో పెట్టినందుకు చాలా థ్యాంక్స్ బిగ్‌బాస్.. అంటూ చెప్పుకొచ్చాడు జెస్సీ.
ఇక జెస్సీకి వెల్ కమ్ బ్యాక్ చెప్తూ.. మిమ్నల్ని వైద్య పరీక్షల కోసం బయటకు తీసుకుని వెళ్లాం.. డాక్టర్లు పరీక్షించి ఆల్ క్లియర్ అని చెప్పారు. కానీ.. ఇంట్లోకి వెళ్లడానికి ముందు క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది. బిగ్‌బాస్ ఆదేశాలు వచ్చేవరకు మీరు ఇక్కడే ఉండాలని చెప్పారు బిగ్‌బాస్.
ఇక ఇదిలా ఉంటే.. జెస్సీ అలా ఆకస్మాత్తుగా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో సిరి, షణ్ము ఇద్దరూ తెగ ఫీల్ అయ్యారు. మరోవైపు.. శ్రీరామ్.. కాజల్ బాగా ఇన్ ఫ్లూయెన్స్ అవుతుందని చెప్పాడు. ఇక మానస్.. పింకీ తనకు ఇచ్చిన వస్తువులను తిరిగి ఇచ్చేయడంతో ఎమోషనల్ అయ్యింది. నేను.. జెస్సీ,షణ్ము ముగ్గురం కంటెండర్ అవగానే కెప్టెన్ అయ్యామని చెప్తూ ఉప్పొంగిపోయింది సిరి. కానీ నేను కంటెండర్ అవగానే నామినేట్ అవుతున్నానని రవి అనగా.. ఎలిమినేట్ మాత్రం కావడం లేదు అని అనేశాడు షణ్ముఖ్. ఇక సిరి తనపై జోక్ చేసిందని ఫీలయ్యాడు షణ్ముఖ్. అలాగే.. పింకీ తనతో గొడవ పెట్టుకుందని.. ఇక ఎలా ఉంటుందో చూపిస్తానంటూ సిరితో చెప్పుకొచ్చాడు షణ్ము. ఇక ఎట్టకేలకు ప్రియాంక, మానస్ మనసు కరిగించేసింది. భోజనం ప్లేటు పట్టుకుని ముద్దు కావాలా ? ముద్దు కావాలా ? అని అడగ్గా.. ముద్దు కావాలన్నాడు మానస్. దీంతో ప్రియాంక అతడిపై ముద్దుల వర్షం కురిపించింది.
Also Read: Pradeep Machiraju: మహాభారత యుద్ధంలో కౌరవ..పాండవ సేనకు భోజనం పెట్టింది ఎవరు? ఆహా..అనిపించిన ప్రదీప్!
Oka Chinna Family Story: నాగార్జున చేతుల మీదుగా విడుదలైన “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” ట్రైలర్..