Bigg Boss 5 Telugu Finale: సిరి, మానస్ ఎలిమినేటేడ్.. !! విన్నర్ అతడేనంటూ..

బిగ్‏బాస్ సీజన్ 5 ఈరోజుతో ముగియనుంది. ఈరోజు సాయంత్రం బిగ్‏బాస్ సీజన్ విన్నర్ ఎవరనేది తేలీపోనుంది. అయితే గత సీజన్లకు

Bigg Boss 5 Telugu Finale: సిరి, మానస్ ఎలిమినేటేడ్.. !! విన్నర్ అతడేనంటూ..
Siri Manas

Edited By: Ram Naramaneni

Updated on: Dec 19, 2021 | 6:41 PM

బిగ్‏బాస్ సీజన్ 5 ఈరోజుతో ముగియనుంది. ఈరోజు సాయంత్రం బిగ్‏బాస్ సీజన్ విన్నర్ ఎవరనేది తేలీపోనుంది. అయితే గత సీజన్లకు భిన్నంగా సీజన్ 5 ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. రణవీర్ సింగ్, అలియా భట్, సుకుమార్, సాయి పల్లవి, రామ్ చరణ్, రాజమౌళి బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై సందడి చేయనున్నట్లుగా సమాచారం. అలాగే టాప్ సెలబ్రెటీస్‏తో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఉండబోతున్నట్లుగా టాక్. అయితే ముందు నుంచి విన్నర్ ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.

శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో శనివారం గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూటింగ్ పూర్తైంది. అయితే ముందుగా టాప్ 5నుంచి సిరి ఎలిమినేట్ అయినట్లుగా నెట్టింట్లో టాక్ వినిపిస్తుంది. సిరి 5వ స్థానంలో నిలవగా.. మానస్ నాల్గవ స్థానంలో నిలిచినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ముందుగా డైరెక్టర్ సుకుమార్ డ్రోన్స్ ద్వారా సిరి ఎలిమినేషన్ ప్రకటించగా.. ఆ తర్వాత హీరోయిన్ సాయి పల్లవి చేతుల మీదుగా మానస్ ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించనున్నారని టాక్. అయితే ఎలిమినేషన్‎కు సిరికి పది లక్షలు ఆఫర్ చేయగా.. ఆమె ఆ డబ్బును రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం. అనంతరం మానస్‏కు ఆ ఆఫర్ ఇవ్వగా అతడు కూడా కాదనుకున్నాడట. ఇక పది లక్షల ఆఫర్ కోసం ఎవరు ముందుకు రాలేదని టాక్.

అలాగే మూడో స్థానంలో షణ్ముఖ్ నిలవగా.. టాప్ 2 స్థానంలలో శ్రీరామ్, సన్నీ ఉండనున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ముగ్గురిలో శ్రీరామ్, సన్నీ మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్లుగా టాక్. వీరిద్ధరిలో ఎవరో ఒకరు విన్నర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సన్నీ విన్నర్ అయ్యాడని.. శ్రీరామ్ రన్నరప్ అయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు లీకయ్యాయి. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలిచిన వారికి రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ, ట్రోఫీతో పాటుగా, ఓ బైక్ ను కూడా అందించనున్నారు. ఇక రన్నరప్ గా నిలిచే కంటెస్టెంట్ కు 25 లక్షలు అందించనున్న విషయం తెలిసిందే.

Also Read: Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5 విన్నర్‌ సన్నీనేనా.. రెండో స్థానంలో కూడా నిలవని షణ్ముఖ్‌.? వైరల్‌ అవుతోన్న వార్త..

Bigg Boss 5 Telugu Ep.105: సందడిగా 5వ సీజన్ ఫైనల్ డే.. హౌస్‌లో రచ్చ చేసిన మాజీ కంటెస్టెంట్స్..

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ 5 తెలుగు గ్రాండ్‌ ఫినాలే.. ఎప్పుడు.. ఎక్కడ.. ముఖ్య అతిథులుగా ఎవరు..?