బిగ్‌బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంది. మరో రెండ్రోజుల్లో విజేత ఎవరనేదానిపై స్పష్టత రానుంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరు అనే విషయంపై ఇప్పటికే ఉత్కంఠ మొదలైంది. తమ అభిమాన కంటెస్టెంట్స్‌ను గెలిపించుకునేందుకు ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారాల గురించి తెలిసిందే. ఈ క్రమంలో తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్‌కు పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే రంగంలోకి దిగి ప్రచారం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బిగ్‌బాస్ ఇంట్లో సరదా కార్యక్రమాలు జరుగుతూ.. హౌస్ మేట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. గత టాస్కులనే మళ్లీ ఇస్తూ.. ఫన్ క్రియేట్ చేస్తున్నారు బిగ్‌బాస్. అయితే ఫినాలేకు మరో రెండు రోజుల సమయం ఉండగా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్.
తాజాగా ఈరోజు విడుదలైన ప్రోమోలో సిరి ఎలిమినేట్ అయినట్లు చూపించాడు. ముందుగా ఇంటి సభ్యులందరూ తమమ బట్టలు సర్దుకుని గార్డెన్ ఏరియాకు రమ్మని ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో అందరూ తమ లగేజీ తీసుకుని గార్డెన్ ఏరియాలోకి వచ్చి నిల్చున్నారు. అయితే ఈ ఇంటలో మీలో ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగుస్తుంది. బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లే ఆ ఒక్కరు ఎవరని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు బిగ్‌బాస్. అయితే షణ్ముఖ్.. ఎక్కువగా ఊహాగానాలు చేస్తున్నాడు అని మానస్ చెప్పగా.. మిగతా వాళ్లతో పెద్దగా గొడవలు లేవంటూ షణ్ముఖ్ పేరు చెప్పాడు. ఇక హౌస్‌మేట్స్ అనగానే ఒకరితో ఒకరికి ఇంటరాక్షన్ ముఖ్యం. ఉన్న నలుగురిలో సిరితో నాకు ఇంటరాక్షన్ తక్కువ. కాబట్టి ఆమెనే అనుకుంటున్నా అని శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత.. సిరి ఇంటి నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తి అని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో కంగుతిన్న సిరి.. నేను వెళ్లను అంటూ ఏడుస్తూ అక్కడే కూర్చుంది. అయితే బిగ్‌బాస్ డోర్లు ఓపెన్ చేయడంతో.. సిరి, షణ్ముఖ్ ఏడుస్తూ కనిపించారు. తాజా ప్రోమోలో మాత్రం సిరి బయటకు వెళ్లడం.. షణ్ముఖ్ గేట్స్ వద్దే కూర్చుని ఏడుస్తుండడం చూపించారు. మరి నిజంగానే సిరి బయటకు వెళ్లిందా.. లేదా షణ్ముఖ్ కోసం ఓట్లు రాబట్టేందుకు బిగ్‌బాస్ ఇలా ప్లాన్ చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. షణ్ముఖ్ ఫ్యాన్స్ ఇన్ని రోజులు సిరికి సైతం ఓట్స్ వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సిరి ఎలిమినేట్ అయితే మాత్రం పూర్తి ఓట్లన్ని షణ్ముఖ్‌కు పడే అవకాశం ఉంది. దీంతో షణ్ముఖ్ పుంజుకోవడం ఖాయంగా తెలుస్తోంది.
ప్రోమో..
Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్
Pushpa: థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప’ రాజ్.. బన్నీ సినిమాకి సంబంధించిన 9 అద్భుతాలు ఇవే!