బిగ్‌బాస్ సీజన్ 5 ఏడు వారాలు ముగించుకుంది. సీజన్ ప్రారంభమై 50 రోజులు గడిచింది. అంటే ఆట సగం కంప్లీట్ అయ్యింది. ఇక ఈవారం నామినేషన్స్ ప్రక్రియను కాస్త డిఫరెంట్‌గా చేశారు బిగ్‌బాస్. ఇక ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్ ఆరుగురు నామినేట్ అయ్యారు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అభయహస్తం… ఈ టాస్కులో భాగంగా లాక్ డౌన్ లోనే ఉంటుందని.. ఇంటి సభ్యులు మొత్తం గార్డెన్ ఏరియాలోనే ఉంటారని సూచించాడు బిగ్ బాస్. కెప్టెన్సీ కంటెండర్ పోటీలో గెలిచిన వారు మాత్రమే ఇంట్లోకి వెళ్లడానికి అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఈ టాస్కులో మొత్తం ఐదు ఛాలెంజ్‌లు ఉంటాయని… మొదటి ఛాలెంజ్‌లో ఓడిపోయిన వారు రెండో ఛాలెంజ్‌లో పాల్గోనే అవకాశం ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. దీంతో మొదటి ఛాలెంజ్‌లో ముందుగా షణ్ముఖ్, లోబోలు పాల్గొన్నారు. మొదటి టాస్కులో మట్టి కలిపిన పేడలో ముత్యాలను కనిపెట్టాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కువ ముత్యాలను వెతికిపట్టుకుంటారో వాళ్లే విజేతలను చెప్పారు. అయితే పేడ వాసనకు ఇంటి సభ్యులు ముక్కు మూసుకుంటే… కాజల్ మాత్రం తనకు ఆ వాసన అంటే ఇష్టమంటూ ఓవర్ చేసింది. ఇక టాస్క్ స్టార్ట్ కాగానే.. పేడలో వెతికిన ముత్యాలను నీళ్లలో కడిగి పక్కన పెట్టాల. అయితే ఇందులో లోబో కంటే షణ్ముఖ్ ముత్యాలను కనిపెట్టాడు.. అయితే షణ్ముఖ్ ముత్యాలు శుభ్రంగా లేవు.. కానీ లోబో తీసిన ముత్యాలు మాత్రం శుభ్రంగా ఉన్నాయి. దీంతో సంచాలకులుగా ఉన్న సన్నీకి ఆలోచనలో పడ్డాడు. అయితే షణ్ముఖ్ ముత్యాలు సరిగ్గా లేవని విశ్వ, శ్రీరామ్, రవి అనగా.. శుభ్రంగా ఉండడం కాదు.. ఎక్కువ తీయాలంతే అంటూ షణ్ముఖ్‌కు సపోర్ట్ చేసింది సిరి. ఇక చివరకు సన్నీ.. షణ్ముఖ్ విజేత అని ప్రకటించగానే..సిరి ఎగిరి గంతేసి షణ్ముఖ్‌ను హగ్ చేసుకుంది. మొత్తానికి షో ప్రారంభమైన 50 రోజులు పూర్తిచేసిన తర్వాత షణ్ముఖ్ గేమ్ ఆడటానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
Also Read: Manchu Manoj: ఇంతకీ ఆ తెల్ల పిల్ల ఎవరు.? తన రెండో పెళ్లి వార్తలపై స్పందించిన మంచు మనోజ్..
NIkhil Siddharth: గతంలో ఎన్నడూ చేయని పని చేస్తున్న నిఖిల్.. ఇంతకీ ఆ పని ఏంటనేగా.?