బుల్లితెరపై బిగ్ బాస్ షో సందడి చేస్తుంది. హౌస్‌లో ఉన్న సభ్యులు అంతగా పాపులర్ సెలబ్రెటీలు కాకపోయిన.. షో మొదటి రోజు నుంచే గొడవలతో రచ్చ చేస్తూ.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నారు. ఎవరికి ఎవరు తక్కువ కాదు అన్నట్టుగా రోజుకు ఒక ఎమోషనల్ డ్రామాతో బిగ్ బాస్‌కు పనిలేకుండానే.. ఆసక్తి కలిగిస్తున్నారు కంటెస్టెంట్స్. అయితే ఈ బిగ్ బాస్ షోను సినీ ప్రముఖులు కూడా ఫాలో అవుతుంటారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఈ షోపై స్పందిస్తూ.. తన మద్దతు ఎవరికో చెప్పేశాడు.
బిగ్ బాస్ షో చూస్తున్నాను.. చాలా మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో యాంకర్ రవి.. షణ్ముఖ్, ప్రియ, నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్ వంటి వారిని వచ్చారు. వారితోపాటు.. ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ కూడా వచ్చారు. జబర్ధస్త్ షోలో చేసినప్పుడు నాకు పరిచయం. తనలో ఫీలింగ్స్ అమ్మాయిగా ఉండి.. రూపం మాత్రం అబ్బాయిగా ఉండేది. దీంతో వెంటనే ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయారు. ఆ తర్వాత తప్పు చేశానా ? అంటూ డిప్రెషన్లోకి వెళ్లాడు. నేనే ధైర్యం చెప్పాను. ఇలా ఎంతోమంది తామేంటో ఈ ప్రపంచానికి తెలియనివ్వు.. సంఘర్షణను తమలోనే భరిస్తుంటారు. కానీ నువ్వు సాహసం చేశావు. ఈ ఇష్టానికి తగ్గట్టుగా బతుకుతున్నావ్ అంటూ సపోర్ట్ ఇచ్చాను. కానీ ఆ తర్వాత షోలో అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత నేను వేరే షోకు తీసుకున్నాను. అలాగే సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టుకుంది. నా ముందే ఎదిగింది.. ఎవ్వరిని నొప్పించని మనస్తత్వం. బిగ్ బాస్ లోకి వెళ్తుంది అని తెలియానే సర్ ప్రైజ్ అనిపించింది. అక్కడకు వెళ్లడమే పెద్ద అచీవ్ మెంట్ గా ఫీలవుతుంటారు. గెలిచినా.. ఓడినా.. గొప్పగా ఫీలవుతుంటారు. అలాంటి అతి పెద్ద షోలోకి ప్రియాంక వెళ్లడం ఆనందంగా ఉంది.. తనకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. తను కెమెరా ముందు ఎలా ఉందో.. బయట కూడా అలాగే ఉంటుంది. విన్నర్ కావడమా.. లేదా అన్నది తెలియదు.. కానీ నా మద్దతు మాత్రం తనకే అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు.