AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu: రైతు సింపతి వాడుతున్నావా.. ? ట్రోల్స్‏కు ఇచ్చిపడేసిన సింగర్ ఝాన్సీ..

బిగ్ బాస్ తెలుగు 10 మరికొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా డైరక్ట బిగ్ బాస్ ఎంట్రీ టికెట్ అందుకుంది సింగర్ ఝాన్సీ. ఒక కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టనుంది. కంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కోట్ల మందికి పరిచయం అవ్వడమే తన లక్ష్యమని, ట్రోల్స్‌ను, విమర్శలను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతానని ఝాన్సీ తెలిపారు. ఆమె ఆట తీరు, ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించే విధానంపై ఆమె పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

Bigg Boss 10 Telugu: రైతు సింపతి వాడుతున్నావా.. ? ట్రోల్స్‏కు ఇచ్చిపడేసిన సింగర్ ఝాన్సీ..
Singer Jansi
Rajitha Chanti
|

Updated on: Sep 06, 2026 | 11:37 AM

Share

బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ కాబోతుంది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో అట్టహాసంగా జరగనుంది. అయితే ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ టికెట్ అందుకుంది సింగర్ ఝాన్సీ. ఈ క్రమంలోనే తాజాగా టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన బిగ్ బాస్ ప్రయాణం, లక్ష్యాలపై మాట్లాడారు. “బిగ్ బాస్ ఎందుకు?” అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, “కొన్ని కోట్ల మందికి పరిచయం అవ్వాలని ఈ బిగ్ బాస్ షో ని ఎంచుకున్నాను” అని ఝాన్సీ తెలిపారు. తన గురించి వస్తున్న విమర్శలపైనా ఆమె స్పందించారు. “జడ్జెస్ ఏమో అమాయకత్వం అంటున్నారు. మీ కంటెస్టెంట్స్ ఏమో ఆ అమ్మాయి మూడీగా, డల్ గా, ఒక పక్కకు వేరే జోన్ లో ఉంటుంది” అని ప్రస్తావిస్తూ, “కొన్ని కొన్ని మాటల్లో కన్నా చేతల్లో చూపిస్తేనే మంచిది” అని తన దృఢ సంకల్పాన్ని వెల్లడించారు. తనపై వస్తున్న ట్రోల్స్, ముఖ్యంగా “రైతు సింపతి వాడుతుంది, ఈమె ఒక్కతే చేస్తుందా వ్యవసాయము?” వంటి వ్యాఖ్యలపైనా ఆమె నిబ్బరంగా స్పందించారు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

బిగ్ బాస్ టికెట్ చేతిలో పట్టుకున్నప్పుడు కలిగిన అనుభూతి గురించి చెబుతూ, “ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. ఇది కావాల్సింది నాకు” అని తన ఆనందాన్ని పంచుకున్నారు. షోలో ఎవరైనా ఆటిట్యూడ్ చూపిస్తే ఎలా ఎదుర్కొంటారని అడగగా, “కచ్చితంగా ఇచ్చి పడేస్తా” అని ధీమా వ్యక్తం చేశారు. “రైతు బిడ్డ” అనే ట్యాగ్ నెగటివ్ కాదని, అది తనకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని ఝాన్సీ స్పష్టం చేశారు. ఈ ఇంటర్వ్యూ ఆమె బిగ్ బాస్ ప్రయాణంపై మరింత ఆసక్తిని రేకెత్తించింది.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

బిగ్ బాస్ కంటెస్టెంట్ ఝాన్సీ ఇంటర్వ్యూ ప్రోమో..

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

Follow Us