AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu: సెలబ్రిటీలకు సెలబ్రిటీలే మద్దతా..? మానస్ మాటలతో మరింత వేడెక్కిన ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్’ చర్చ..

బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో కామనర్స్, సెలబ్రిటీల మధ్య విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అదే విభజన హౌస్ బయట కూడా కనిపిస్తోందా అనే చర్చ మొదలైంది. ఈక్రమంలోనే తాజాగా మాజీ కంటెస్టెంట్ మానస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉన్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

Bigg Boss 10 Telugu: సెలబ్రిటీలకు సెలబ్రిటీలే మద్దతా..? మానస్ మాటలతో మరింత వేడెక్కిన ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్’ చర్చ..
Maanas
Rajitha Chanti
|

Updated on: Sep 11, 2026 | 11:56 AM

Share

ఇటీవల జియోహాట్‌స్టార్‌లో జరిగిన ‘బిగ్‌బాస్ తెలుగు 24/7 లైవ్ చాట్‌’లో మాజీ కంటెస్టెంట్ మానస్ నాగులపల్లి సెలబ్రిటీలకు బహిరంగంగా మద్దతు తెలిపాడు. తన ఫేవరెట్ కంటెస్టెంట్లలో దేబ్‌జానీ, రామ్ ప్రసాద్, నరేష్ పేర్లను ప్రస్తావించిన మానస్, ప్రస్తుతం రామ్ ప్రసాద్‌కు ఓటు వేస్తున్నానని చెప్పాడు. అంతేకాదు, తాను సెలబ్రిటీలకే మద్దతుగా ఉన్నానని స్పష్టం చేశాడు. మానస్ వ్యాఖ్యలతో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్’ చర్చ మరింత వేడెక్కింది. హౌస్ బయట సెలబ్రిటీ కంటెస్టెంట్లకు తెలిసినవారి నుంచి వరుసగా మద్దతు లభిస్తుండగా, కామనర్స్ మాత్రం ఒంటరిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. పెరుగుతున్న ఒత్తిడితో వారు తమలో తాము ముడుచుకుపోతున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

సెలబ్రిటీలు తమవారికే మద్దతు ఇస్తూ కామనర్స్‌ను ఒంటరి పోరాటానికి వదిలేస్తున్నారా? లేక అండర్‌డాగ్స్‌గా కనిపిస్తున్న కామనర్స్ ఒక్కసారిగా పుంజుకొని ఆటను మలుపు తిప్పుతారా? ఈ విభజన మరింత స్పష్టమవుతున్న నేపథ్యంలో ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్’ ఈ సీజన్‌లోనే అతిపెద్ద పోరుగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హౌస్ లో సైతం కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ అన్నట్లుగానే షో సాగుతుంది. మొదటి రోజు నుంచే అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రోహిత్ పై మాటల దాడి చేస్తున్నాడు త్రిగుణ్. గిన్నెలు సరిగ్గా కడగడం లేదని మాటి మాటికి పిలుస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పుడు నెట్టింట కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ అనే చర్చ మరింత హీటెక్కింది.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

Follow Us
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..
ఫోన్‌లో యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్ ఎలా చేయాలి? జస్ట్ ఒక ట్యాప్‌
ఫోన్‌లో యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్ ఎలా చేయాలి? జస్ట్ ఒక ట్యాప్‌
కంటి చూపు మసకబారకుండా ఉండాలంటే ఇవి తింటే చాలు
కంటి చూపు మసకబారకుండా ఉండాలంటే ఇవి తింటే చాలు