సంతానలేమి పరీక్షల కోసం వెళ్లిన ఓ 26 ఏళ్ల యువకుడి కడుపులో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నట్లు గుర్తించి వైద్యులు షాక్కు గురయ్యారు. బాహ్యంగా సాధారణంగా ఉన్నప్పటికీ, అంతర్గతంగా ఈ అరుదైన జన్యుపరమైన సమస్య పీఎండీఎస్ (పెర్సిస్టెంట్ ములేరియన్ డక్ట్ సిండ్రోమ్)గా నిర్ధారణ అయ్యింది. ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కేసులలోనే నమోదైన అత్యంత అరుదైన పరిస్థితి.