ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియా. ముంబైలో ఉన్న ఈ ఇల్లు నిర్మాణానికి అప్పట్లో సుమారు 15 వేల కోట్లు ఖర్చవ్వగా, ప్రస్తుతం దీని విలువ 38 వేల కోట్ల నుండి 40 వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. భూకంపాలను తట్టుకునే సామర్థ్యంతో దీనిని నిర్మించారు.