Bigg Boss: బిగ్ బాస్ రియాలిటీ షో పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. యువత చెడిపోతున్నారంటూ..

బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎక్కువ గానే వచ్చాయి. చాలా మంది ఈ షో పై ఎన్నో ఆరోపణలు చేశారు.

Bigg Boss: బిగ్ బాస్ రియాలిటీ షో పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. యువత చెడిపోతున్నారంటూ..
High Court

Updated on: Apr 30, 2022 | 8:56 AM

బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎక్కువ గానే వచ్చాయి. చాలా మంది ఈ షో పై ఎన్నో ఆరోపణలు చేశారు. సీపీఐ నారాయణ చాలా సార్లు బిగ్ బాస్(Bigg Boss) పై విమర్శలు చేశారు. చిన్నపిల్లలను, యువతను పక్కదారిపట్టిస్తుందని ఆయన ఆరోపించారు. అలాగే బిగ్‌బాస్ షో అశ్లీలతను, అసభ్యతను ప్రోత్సహించేలా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఇది విచారణకు నోచుకోకపోవడంపై నిన్న పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. దాంతో బిగ్ బాస్ షో పై ఏపీ హైకోర్టు తీవ్రవ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ రియాలిటీ షో అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిగా ఉందని అలాగే యువత పెడదారి పడుతోందంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ బిగ్ బాస్ పై దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టు స్పందించింది.. మంచి పిల్ వేశారంటూ పిటిషనర్‌ను ప్రశంసించింది కోర్టు. ఇక ఈ పీల్ ను సోమావారం విచారిస్తామని వెల్లడించింది.

బిగ్‌బాస్ వంటి షోల వల్ల యువత పక్కదారిపడుతోందని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. వీటివల్ల సమాజంలో అశ్లీలత పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది ధర్మస్థానం. ఇలాంటి షోల విషయంలో జోక్యం చేసుకోవాలని జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన హైకోర్టు పేర్కొంది. మా పిల్లలు బాగున్నారని, ఇలాంటి షోలతో మాకేం పని అని ప్రజలు అనుకుంటున్నారు. ఇతరుల గురించి పట్టించుకోకపోతే భవిష్యత్తులో మనకు సమస్య ఎదురైనప్పుడు వారు కూడా పట్టించుకోరని  హైకోర్టు పేర్కొంది. ఈ పిటీషన్ పై  సోమవారం విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నటిపై అత్యాచారం కేసులో ట్విస్ట్.. మరో మహిళ ఆరోపణలతో మలయాళీ నటుడిపై రెండో కేసు నమోదు..

Bollywood vs Sandalwood: లాంగ్వేజ్‌ లడాయి.. పొలిటికల్ టర్న్ తీసుకున్న హిందీ భాష వివాదం..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్ చెప్పిన సర్కారు వారి పాట ఎడిటర్..