AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Rashmi: నాకు వాళ్లందరితో రిలేషన్స్ ఉన్నాయా.. అయితే ప్రూవ్స్ బయటపెట్టు.. యాంకర్ రష్మీ సంచలన ట్వీట్..

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ రష్మీ. ఒకప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆమె.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సుధీర్, రష్మీ జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. సోషళ్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Anchor Rashmi: నాకు వాళ్లందరితో రిలేషన్స్ ఉన్నాయా.. అయితే ప్రూవ్స్ బయటపెట్టు.. యాంకర్ రష్మీ సంచలన ట్వీట్..
Rashmi Gautham
Rajitha Chanti
|

Updated on: Mar 08, 2026 | 9:10 PM

Share

యాంకర్ రష్మీ.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఒకవైపు జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరోవైపు నెట్టింట సందడి చేస్తుంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి ఆసక్తికర ట్వీట్ చేసింది. తాజాగా తన క్యారెక్టర్ ను టార్గెట్ చేస్తూ ఓ నెటిజన్ చేసిన పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పర్సనల్ లైఫ్ గురించి ప్రూఫ్స్ ఉంటే బయటపెట్టాలని మండిపడింది. తనకు రిలేషన్స్ ఉన్నా.. లేకపోయినా తనను వేధించే హక్కు ఎవరికీ లేదని మండిపడింది. తాను పెళ్లి చేసుకునేవరకు ఎంతమందితో తిరిగినా అది మీ సమస్య కాదంటూ తన స్టైల్లో ఇచ్చిపడేసింది.

ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‏నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..

“ముందుగా రుజువు చూపించు.. రెండవది నాకు ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా నాపై వేధింపులకు ఎవరికీ హక్కు లేదు. నేను నిన్ను లేదా మీ తండ్రిని లేదా మీ కొడుకును వివాహం చేసుకునే వరకు నీను ఎంత మందితో తిరిగిన అది మీ సమస్య కాదు. అలాగే నాకు యెవరి యవిరి తో లింక్ ఉండో దయచేసి వాలా పేర్లు ప్రూఫ్ తో సహా చెప్పండి. నా పేరు యెందుకు, మీరు ఎవరినైనా కారెక్టరేట్ హత్య చేయాలనుకుంటే ఇద్దరి పేర్లు బయట పెట్టండి అది న్యాయమే.” అంటూ సదరు నెటిజన్ కు గట్టిగానే ఇచ్చిపడేసింది.

ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..

మహిళ దినోత్సవం రోజే యాంకర్ రష్మి వేధింపులకు గురికావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదివరకు ఎన్నోసార్లు తన గురించి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ కు గట్టిగానే ఇచ్చిపడేసింది యాంకర్ రష్మీ. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటుంది రష్మీ.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

Follow Us