Lasya Manjunath: ర్యాప్‌ సాంగ్‌తో అదరగొట్టిన లాస్య.. తల్లీబిడ్డలందరికీ అంకితం అంటూ..

సోషల్‌ మీడియాలోనూ బిజీగా ఉండే లాస్య నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలతో పాటు కామెడీ వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఇక లాస్య టాక్స్‌(Lasya Talks) అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో తోటి నటీనటులతో చేసే కామెడీ స్కిట్లను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను, నెటిజన్లను ఎంటర్‌టైన్‌ చేస్తోంది.

Lasya Manjunath: ర్యాప్‌ సాంగ్‌తో అదరగొట్టిన లాస్య.. తల్లీబిడ్డలందరికీ అంకితం అంటూ..
Anchor Lasya

Updated on: May 07, 2022 | 9:50 PM

Mothers Day 2022: తన మాటల గారడీతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే యాంకర్లలో లాస్యా మంజునాథ్‌ (Lasya Manjunath) కూడా ఒకరు. పలు టీవీ షోల్లో హోస్ట్‌గా ఆకట్టుకున్న ఆమె బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లోనూ పాల్గొని వినోదం పంచింది. సోషల్‌ మీడియాలోనూ బిజీగా ఉండే ఈ అందాల తార నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలతో పాటు కామెడీ వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఇక లాస్య టాక్స్‌(Lasya Talks) అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో తోటి నటీనటులతో చేసే కామెడీ స్కిట్లను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను, నెటిజన్లను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. తాజాగా ఆమె ఓ ర్యాప్‌ సాంగ్‌ను పాడింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను Savage Mom పేరుతో నా మొదటి మ్యూజిక్‌ వీడియో అంటూ యూట్యూబ్‌లో షేర్‌ చేసింది.

ర్యాప్‌తోనూ ఇరగదీస్తా..

‘ప్రపంచమంతా తల్లుల దినోత్సవం జరుపుకుంటే వీళ్లేమో నాకు తలనొప్పిలా తయారయ్యారు’ అంటూ తన భర్త, పిల్లలను చూపిస్తూ లాస్య చెప్పే డైలాగ్‌తో ఈ వీడియో మొదలవుతుంది. అనంతరం తన కూతురు హెడ్‌ఫోన్స్‌ పాటలు వినడం చూసి తను కూడా వింటుంది. ‘ఇవేం పాటలే’ అంటూ కూతురును దండిస్తుంది. ‘ఇది ర్యాప్‌. నీకెం తెలియదంటూ’ తల్లికి చెప్పడంతో లాస్య ర్యాప్‌ సాంగ్ అందుకుంటుంది. ఇంగ్లిష్‌ ఆల్ఫాబెట్స్‌లోని A నుంచి Z వరకు అన్ని లెటర్స్‌తో సాంగ్‌ పాడి వినిపిస్తుంది. ‘ఏజ్‌ బార్‌ అనుకోవద్దు న్యూ ఏజ్‌ మామ్‌ నేను.. ర్యాప్‌తోను ఇరగదీసే సావేజ్‌ మామ్‌ నేను.. బాసాన్లు తోమమంటే సాకులన్ని చెప్తవు.. బుక్కు ముందు పెట్టుకుని గురక పెట్టి పంటవు.. అంటూ’ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక తల్లుల దినోత్సవం సందర్బంగా వీడియో చివరిలో ఈ పాటను తల్లీబిడ్డలందరికీ అంకితం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది లాస్య. మరి అందరినీ ఆకట్టుకుంటోన్న ఈ ట్రెండింగ్‌ సాంగ్‌ను మీరు కూడా చూసి ఎంజాయ్‌ చేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Pawan Kalyan: పవర్‌స్టార్‌ను కలిసిన స్టార్‌ కమెడియన్‌.. తన సంతోషాన్ని ఎలా షేర్‌ చేసుకున్నాడో తెలుసా?

PBKS vs RR, IPL 2022: తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగిన జైస్వాల్‌.. పంజాబ్‌ ప్లే ఆఫ్‌ ఆశలకు చెక్‌!

Things Banned For Afghan Women: నెయిల్ పాలిష్ నుంచి హైహీల్స్ వరకు.. అఫ్గాన్‌ మహిళలపై ఉన్న ఆంక్షలివే..