Pan India Movies: తెలుగుచలన చిత్ర పరిశ్రమ తన మార్కెట్ పరిధిని విస్తరించుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలతో దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమాతో ప్రభాస్ దేశ వ్యాప్తంగా సత్తా చాటగా తాజాగా చాలామంది హీరో పాన్-ఇండియా సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవర కొండ తదితరులు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
*జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్‌లు కూడా టించనున్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కానుంది. బాహుబలి సినిమాతో ఆకట్టుకున్న రాజమౌళి, భారీ నటుల నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
*అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
*విజయ్ దేవరకొండ తాజా సినిమా లైగర్. ఈ సినిమా పాన్-ఇండియామూవీగా తెరకెక్కుతుంది. విజయ్ దేవర కొండకు జతగా అనన్య పాండే నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది
*పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న “హరి హర వీర మల్లు” కూడా పాన్-ఇండియా ప్రాజెక్ట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 29 న విడుదల కానుంది. *మహేష్ బాబు కూడా “సర్కారు వారి పాట” కోసం దేశవ్యాప్తంగా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.
*ప్రభాస్ , శ్రియ శరణ్ నటించిన రాజమౌళి “ఛత్రపతి” మూవీ బాలీవుడ్ లో రీమేక్ కానుంది. అడుగుపెట్టనున్నాడు. ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
దీంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. చాలా మంది హీరోలు తమ సినిమాలను దేశ వ్యాప్తంగా రిలీజ్‌లకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలను దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: దాదాపు 750 సినిమాల్లో నటించిన హాస్య నటుడు.. నేడు ఆర్ధిక ఇబ్బందులతో చికిత్స కోసం ఎదురుచూపులు