త్వరలోనే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కి సీక్వెల్?

| Edited By:

Apr 23, 2020 | 2:03 PM

'షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్రా.. కానీ ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒరిజినల్' అంటూ టాలీవుడ్‌లో కొత్త ఒరవడి సృష్టించాడు నవీన్ పొలిశెట్టి. పోలీసులకు కూడా అంతుచిక్కని కేసుల్ని..

త్వరలోనే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకి సీక్వెల్?
Follow us on

కామెడీ, సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. గతేడాది విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. నవీన్ పొలిశెట్టి హీరోగా మొదటిసారి ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాకి స్వరూప్ ఆర్ఎస్‌జే దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని ఫిల్మ్ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది.

‘షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్రా.. కానీ ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒరిజినల్’ అంటూ టాలీవుడ్‌లో కొత్త ఒరవడి సృష్టించాడు నవీన్ పొలిశెట్టి. పోలీసులకు కూడా అంతుచిక్కని కేసుల్ని ఛేదించే ఏజెంట్‌గా నవీన్ నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. మరి ఇలాంటి చిత్రానికి కొనసాగింపు రూపొందితే.. అంచనాలు భారీగా ఉంటాయి. దాంతో అంతకు మించిన కథను సిద్ధం చేయాలి. అలాటే అటు స్వరూప్, నవీన్ కూడా ప్రస్తుతం దీనికి సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నారట. కథ కొత్తగా ఉంటేనే మరోసారి ప్రేక్షకులు ఆదరిస్తారనే ఉద్ధేశ్యంతో స్క్రిప్ట్ పక్కాగా రూపొందించే పనిలో ఉన్నారని టాక్.

Read More: 

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

అగ్నికి ఆహుతైన.. లారీ శానిటైజర్

కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం